CM Revanth Reddy: కోదండరాంను ప్రశ్నించేంత పెద్దోళ్లా?.. కుట్రతోనే అడ్డుకున్నారు.. మండపడ్డ సీఎం రేవంత్
చట్టసభకు వెళ్లకుండా కోదండరాంను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్రలు పన్నిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమసారథిగా నిలిచిన కోదండరాం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపికను ప్రశ్నించడం భావదారిద్ర్యమే అవుతుందన్నారు.