Revanth Reddy Birthday: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. జడ్పీటీసీ టూ సీఎం.. ఆయన సక్సెస్ కు కారణం ఇదే..! 2007లో జడ్పీటీసీగా ప్రయాణం ప్రారంభం.. 2023లో సీఎం.. ఇది రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్. ఐదేళ్ల క్రితం పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఓడించిన పార్టీని.. అధికారం నుంచి దూరం చేశాడు. జైలుకు పంపించిన సీఎంను ఇంటింకి పంపించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. నేడు రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.. By Nikhil మరియు Manoj Varma 08 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి దెబ్బ తింటున్నా.. రక్తం కారుతున్నా.. కిందకేసి కొడుతున్నా.. వెంటాడి-వేటాడి ఓడించినా.. ఎక్కడా వణకలేదు, బెణకలేదు, లోంగలేదు రేవంత్ రెడ్డి. పాతాళానికి పంపాలని చూసినవాళ్లకి అధోపాతాళానికి పంపారు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తొక్కలని చూస్తే తొక్కించుకునే రకం కాదు రేవంత్.. తొక్క తీస్తా అనే రకం.. అదే రేవంత్‌రెడ్డి మొదటి గెలుపు సూత్రం. చుట్టూ ప్రతికూలతలున్నా.. ఉప్పెనలు, తుపానులు ముంచెత్తినా.. వాటన్నిటిని తప్పించుకోని ఆకాశమంత ఎత్తుకు ఎగరగలడు రేవంత్. తెలంగాణ ఎన్నికల్లో(Telangana elections) రాజకీయ దిగ్గజాల ఎత్తులను చిత్తు చేసి, కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కింది. Also Read : డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు షాక్..తొలగిస్తూ ఉత్తర్వులు పట్టుదలే ఆయన్ను గెలిపించింది: ప్రతీ ఒక్కరికి జీవిత లక్ష్యం ఉంటుంది. కలలు ఉంటాయి.. అయితే సాధించాలన్న పట్టుదల, సంకల్పం మాత్రం కొద్ది మందిలోనే ఉంటుంది. 1969 నవంబరు 8న పుట్టారు రేవంత్‌రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గరలోని కొండారెడ్డిపల్లిలో అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించిన రేవంత్‌రెడ్డిది సాధారణ రైతు కుటంబం. ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఏబీపీవీకి పనిచేశారు రేవంత్. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి తమ్ముడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారంతో పాటు జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్‌గా పని చేసిన రేవంత్ తర్వాత రాజకీయాలవైపు అడుగులు వేశారు. Also Read : మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే.. 2002లో టీఆర్ఎస్ లో చేరిన రేవంత్ 2002లో టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్)లో చేరిన రేవంత్‌రెడ్డి ఆ తర్వాత కల్వకుర్తి టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కలేదు.. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తానెంటో నిరూపించుకోవాలనుకున్నారు. ముందు జడ్పీటీసీ సభ్యుడిగా గెలవాలని నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయిన రేవంత్ కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వైఎస్ గాలి రాష్ట్రవ్యాప్తంగా వీస్తోంది. నాటి బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని ఢీకొట్టి గెలవడం రేవంత్‌లోని పట్టుదలనకు నిదర్శనం. అక్కడ నుంచి మొదలైన అసలుసిసలైన రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక్కొ మెట్టు ఎక్కుతూ.. మధ్యలో కిందపడుతూ, పైకి లేస్తూ అందరి మనసులను కొల్లగొట్టే వరకు చేరింది. 2008లో టీడీపీలో చేరిన రేవంత్ జడ్పీటీసీ సభ్యునిగా గెలిచిన తర్వాత ఏడాదికి అంటే 2007లో స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు. 2008లో నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో చేరారు. కాంగ్రెస్ వేవ్ బలంగా ఉన్న సమయంలోనూ ప్రతిపక్ష పార్టీలో సాధారణ లీడర్‌గా అడుగుపెట్టిన రేవంత్ తన జీవిత లక్ష్యాలు ఎంత పెద్దవో, ఎలాంటివో నాడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు చెప్పారు. తనతో పాటే ఎమ్మెల్సీగా, తన బెంచ్‌లో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో ఏదో ఒక రోజు తాను సీఎం అవుతానని ఆనాడే రేవంత్ చెప్పారంటే ఆయన విజన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే టీడీపీ అని ప్రజలు భావించే రోజులవి. ఎన్టీఆర్ తర్వాత టీడీపీ అంటే ప్రజలు చంద్రబాబే అంటారు. అప్పటికీ ఏపీ వీడిపోలేదు.. తెలంగాణ ఆవిర్భవించలేదు.. అయినా రేవంత్ 'నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా' అని చెప్పడం మేధవుల్లో ప్రముఖలైన ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ఆయనే తాజాగా చెప్పుకొచ్చారు. Best wishes to Telangana CM Shri Revanth Reddy Ji on his birthday. I pray for his long and healthy life. @revanth_anumula — Narendra Modi (@narendramodi) November 8, 2024 Also Read : ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓటుకు నోటు: 2009లో తొలిసారి కొడంగల్ నుంచి పోటి చేసి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచారు. అయితే ఆ తర్వాత రేవంత్‌ను కేసులు చుట్టుముట్టాయి. 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ అవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఎక్కడ చూసినా ఈ కేసు గురించే చర్చ జరిగింది. రేవంత్ ఇలా చేయడం వెనుక నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారన్న ప్రచారం విషయం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. టీడీపీ వర్సెస్ టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) యుద్ధంలా మారిన నాటి ఘటనలో రేవంత్ జైలుకు వెళ్లారు. తన ఒక్కగాన ఒక్క కూతురి పెళ్లి సమయంలో ఇలా జరగడం ఆయన్ను ఎంతగానో బాధపెట్టింది.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2017లో కాంగ్రెస్‌లో చేరారు రేవంత్. అప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి ఏం బాలేదు. తొలి విడుత పాలనలో కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ముందస్తుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2019లో జరగాల్సిన ఎన్నికలు.. 2018 డిసెంబర్‌లోనే జరిగాయి. కిందపడేశారు.. పైకి లేచి దూసుకెళ్లాడు: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ కేసీఆర్ ముదురుతున్న సమయంలోనే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కేసీఆర్‌పై నేరుగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంలో అప్పటికీ అందరికంటే ముందున్న రేవంత్‌ను ఓడించేందుకు టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) కొడంగల్‌పై ఎక్కువగా ఫోకస్ చేసింది. రేవంత్ ఓడిపోయారు. అయితే కుంగిపోలేదు.. బాధపడలేదు.. ఎందుకు ఓడిపోయానోనని లెక్కలేసుకోలేదు.. తర్వాత ఏం చేయలన్నదే ఆలోచించాడు. తనను కిందపడేసి నవ్వుతున్న ప్రత్యర్థులను చూసి నవ్వుకుంటూ పైకి లేచాడు. 2019 జనరల్ ఎలక్షన్స్‌లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటి చేశాడు.. గెలిచాడు.. పార్లమెంట్‌లో అడుగుపెట్టాడు. తెలంగాణ కాంగ్రెస్‌ను ముందుండి నడిపించాడు. పనితనం ఉంటే పదవులు అవే వస్తాయ్: పదవుల వెనక పడితే పవర్ రాదు.. పవర్ ఉంటే పదవులు అవే వస్తాయ్. రేవంత్‌రెడ్డిలోని ఓ లీడర్‌ని కాంగ్రెస్ గుర్తించింది. రేవంత్ మాటలు, ప్రజలను ఇంప్రెస్ చేసే తీరు, ఆయన డైనమిజం, వర్కింగ్ మెకానిజం, ఆయన ధైర్యం, పోరాటం, పట్టుదల, సంకల్పం ఆయన్ను టీపీసీసీ ప్రెసిడెంట్‌ను చేసేలా చేశాయి. 2021లో రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు ఇవ్వడం సొంతపార్టీ నేతల్లోని కొందరికి ఏ మాత్రం నచ్చలేదు. ఆయనను బహిరంగంగా విమర్శించిన వాళ్లు, మీడియా ముందే బహిరంగంగా తిట్టిన వాళ్ల మధ్యే తిరుగుతూ రేవంత్ పార్టీని ముందుండి నడిపించాడు. ఆ సమయంలో ఆయన ముందున్న లక్ష్యం ఒక్కటే.. అదే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడం. అందుకోసమే అవమానాలను భరించాడు, అలకలను అర్థం చేసుకున్నాడు, ఆవేశం సమస్యకు పరిష్కారం కాదనుకున్నాడు. ఆలోచనతో అడుగులు ముందుకేశాడు..దీంతో సీనియర్లు కూడా కలిసి వచ్చారు. అదిష్టానం అండ తోడైంది. దీంతో కాంగ్రెస్ గెలిచింది.. సీఎం కావాలన్న రేవంత్ లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా పాలన అందిస్తున్నారు రేవంత్. Also Read : అప్పుడే ఆటమ్ బాంబ్ పేలబోతోంది.. పొంగులేటి మరో సంచలనం! #zptc #congress #telangana #revanth-reddy-birthday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి