Ponguleti: అప్పుడే ఆటమ్ బాంబ్ పేలబోతోంది.. పొంగులేటి మరో సంచలనం! తెలంగాణలో త్వరలోనే ఆటమ్ బాంబ్ పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే బయటపెడతామన్నారు. By srinivas 07 Nov 2024 | నవీకరించబడింది పై 07 Nov 2024 20:22 IST in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Ponguleti: తెలంగాణలో త్వరలోనే ఆటమ్ బాంబ్ పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే దీపావళికి పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ ఉత్కంఠ రేపిన పొంగులేటి.. మరోసారి నాటు బాంబు.. లక్ష్మిబాంబు కాదు ఏకంగా ఆటమ్ బాంబులు పేలుతాయంటున్నారు. గురువారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకో తనకు అర్థం కావట్లేదని, తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే బయటపడబోతుందని, అందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇస్తూ పొలిటికల్ చర్చకు తెరలేపారు. Also Read: హైడ్రాపై అసలేం జరుగుతోంది? పేదల సొమ్ము విదేశాలకు పంచి.. ఇక గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులున్నాయని తెలిపారు. అయినా సంక్షేమ పథకాలను నిర్విరామంగా అమలు చేసుకుంటూ తెలంగాణలో 11 నెలల ఇందిరమ్మ రాజ్యాన్ని విజయవంతంగా నడిపిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: WPL: మహిళ ప్రీమియర్ లీగ్ 2025.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే! అలాగే ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదన్నారు. పేదలను మరిచిపోయిన మీరు అధికార దాహంతో ఎంతటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషులుగా నిలబడాల్సిందే. కారుకూతలు కూస్తున్న నేతలు ఏ టైర్ కింద తలపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి #t-congress #telangana #brs #minister-ponguleti-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి