Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప ఎన్నిక అవడంపై రషయాఅధ్యక్షుడు పుతిన్ మొదటిసారిగా స్పందించారు. ట్రంప్‌ను పుతిన్ అభినందించడమే కాకుండా...ఆయనతో చర్చలకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ట్రంప్ ధైర్యవంతుడని పొగిడారు.

New Update
Russia Elections: ఎన్నిసార్లు మీరే అవుతారు మావా.. మరోసారి పుతినే ప్రెసిడెంట్‌!

Russia President Putin: 

ఈ సారి అమెరికా ఎన్నికలు సంచలనం సృష్టించాయి. ప్రంచ దేశాల  దృష్టిని ఆకర్షించాయి.  ఆల్మోస్ట్ క్లీన్ స్వీ చేసినట్టుగా ట్రంప్ విజయం సాధించారు. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్‌ అన్నింటలోనూ విజయ దుందుభి మోగించారు. దీంతో ఆయను ప్రపంచాధినేతలు అందరూ వరుస పెట్టి ట్రంప్‌ను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడ ట్రంప్‌కు కంగ్రాట్స్ చెప్పారు.  ఓ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన తర్వాత పుతిన్‌ అక్కడ క్వశ్చన్ అవర్‌‌లో పాల్గొన్నారు. అందులో ట్రంప్ రెండో పాలన నుంచి ఏం ఆశిస్తున్నారు? అని ప్రశ్నించగా.. ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలియదు. దీనిగురించి నాకేమీ తెలియదు. అధ్యక్ష పదవికి సంబంధించి ట్రంప్‌కు ఇదే చివరి అవకాశం.. ఏం చేస్తారన్నది ఆయనకు సంబంధించిన విషయం అని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న ప్రశ్నకు తాను ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధమేనంటూ జవాబిచ్చారు. 

Also Read :  ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్!

Also Read :  బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. కొట్టుకున్న నబీల్- పృథ్వీ..! కంటెస్టెంట్స్ షాక్

ఇక ట్రంప్ గురించి మాట్లాడుతూ...ఆయన ఎంతో ధైర్యవంతుడని ఒగిడారు. జులైలో ట్రంప్‌ మీద హత్యాయత్నం జరిగినప్పుడు ఎంతో ధైర్యంగా  ఎదుర్కొన్నారని అన్నారు. ఒకవేళ ప్రపంచ నేతలు పరస్పర సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తే.. తాను దానికి వ్యతిరేకం కాదన్నారు. ట్రంప్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 24 గంటల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ చెప్పి ఆటలను పరిశీలించొచ్చని పుతిన్ అన్నారు. అయితే, ఈ విషయంలో విధానపర చర్యల గురించి ఎదురుచూస్తామని తెలిపింది. రష్యా-అమెరికా సంబంధాలు ఇప్పటికే చరిత్రలోనే అత్యంత క్షీణదశలో ఉన్నాయని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వ్యాఖ్యానించారు.  

Also Read: NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా

Also Read :  చిన్నప్పుడు స్టార్ హీరోలకు కూడా ఆ భాదలు తప్పలేదు..!

Advertisment
తాజా కథనాలు