Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. By Bhavana 08 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Heavy Rains : నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. Also Read: TG: ఎల్లుండి నుంచి అసలు సర్వే.. ఏ ఇళ్లు వదలొద్దు: సీఎస్ కీలక ఆదేశాలు ప్రజలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. Also Read: Chennai: బాలికపై ఆటో డ్రైవర్ తో పాటు ఆరుగురు టెక్కీలు అత్యాచారం ఎక్కువ వర్షపాతం.. ఇక తెలుగు రాష్ట్రాల్లో.. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో కూడా నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఇప్పటికే తెలంగాణలో చలితీవ్రత విపరీతంగా పెరిగింది. Also Read: IPL: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్.. రూ.1.25 కోట్ల డిమాండ్! హైదరాబద్ లో ఒక్కసారిగా చలి పెరిగింది. తెల్లవారు జామున చలికి తట్టుకోలేక ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మార్నింగ్ వాకింగ్ చేసేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని మాత్రమే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యులు అంటున్నారు. Also Read: సర్వే వివరాలకు ఆధార్ లింకింగ్.. నకిలీ ఓట్ల రాజకీయానికి బ్రేక్! అల్పపీడన ప్రభావంతో నవంబర్ 11 వరకు నాలుగు రోజుల పాటు మోస్తరు నంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడి.. ఈదురు గాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. Also Read: WPL: మహిళ ప్రీమియర్ లీగ్ 2025.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే! #andhra-pradesh #heavy-rains #imd #telangana #rain-alert మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి