Errabelli Dayakar Rao : కాంగ్రెస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఎర్రబెల్లి బస్తిమే సవాల్

మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నారు. రాసిపెట్టుకోండి.. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్.. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సరే..  బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని అన్నారు.

New Update
errabelli comments

errabelli comments

రేవంత్ సర్కార్‌ పై మాజీ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ గెస్టుగా పాల్గొని మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు.  

Also Read :  అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తాం.. డిప్యూటీ కలెక్టరేట్లకు ఈమెయిల్స్!

రాసిపెట్టుకోండి.. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్.. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సరే..  బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ఎర్రబెల్లి అన్నారు. సర్వేలన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న  ఎర్రబెల్లి..  ఎన్నికలు పెట్టి చూడండి .. తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు.  తాను చెప్పింది నిజం కాకపోతే  రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.   

మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఉందని..  మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోందని ఎర్రబెల్లి  స్పష్టం చేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ 

పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం మంగళవారం జరిగింది.  ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదని.. అంతేకాకుండా  పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని అన్నారు. మంత్రివర్గ విస్తరణలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని సీఎం తేల్చి చెప్పారు.  

Also read : మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ గవాస్కర్ .. వినోద్ కాంబ్లీకి సాయం!

Also Read :  కేసీఆర్‌ మంచోడు... నేను రౌడీ.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

 

brs-party | warangal | errabelli-dayakar-rao | latest telangana news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు