cabinet meeting : మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

పలు కీలక అంశాలపై చర్చించేందుకు మార్చి6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నది. రెండో దఫా గణాంకాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.

New Update
Telangana cabinet meeting

Telangana cabinet meeting

పలు కీలక అంశాలపై చర్చించేందుకు మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నది. ముఖ్యంగా సర్వేలో పాల్గొనని వారికోసం రాష్ట్రంలో నిర్వహించిన రెండో దఫా కులగణన నేపథ్యంలో దానికి సంబంధించిన గణాంకాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలాగే బీసీ కులగణన అధారంగా రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుకోనుంది. పార్లమెంట్ లో 42శాతం బీసీ రిజర్వేషన్ ల బిల్లు ఆమోదం పై క్యాబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Also read :   TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!

 ఈ మేరకు మార్చి7,8 తేదీల్లో ఈ అంశాలపై ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేఫథ్యంలో ఈ అంశాలపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉన్నది. అలాగే రాష్ట్రంలో ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డుల  పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎమ్మె్ల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో ఈ విషయంలో తర్జనభర్జన జరుగుతున్నది.

Also read :  పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. అయిదుగురు మృతి

మార్చి 3తో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియనున్నది. దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కేబినెట్ లో చర్చించే ఆస్కారం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసన సభ సమావేశాల అనంతరం 9న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు ఢిల్లీ వెళ్లనున్నారు. 10 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చూడండి:  హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..! 

ఇది కూడా చూడండి:Kiara Advani : గుడ్‌ న్యూస్‌ చెప్పిన కియారా అద్వానీ .. తల్లి కాబోతున్నట్లు ప్రకటన

Advertisment
తాజా కథనాలు