/rtv/media/media_files/2025/02/28/1MKQiPUs9akrs9O82QW0.jpg)
Bomb Blast in Pakistan
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మసీదు వద్ద భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. నౌషేరా జిల్లాలోని అక్కోరా ఖట్టక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రంజాన్ మాసం ప్రారంభం అయిన వేళ బాంబు పేలుడు జరగడం కలకలం రేపుతోంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Also Read: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు
అయితే ఈ బాంబు దాడి ఏ తీవ్రవాద సంస్థ చేసిందనేదానిపై స్పష్టత లేదు. ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అఫ్ఘాన్ తాలిబాన్‌లతో సంబంధం ఉన్న సెమినారీలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: గజగజ వణికిస్తున్న భారీ అగ్ని ప్రమాదం.. 42వ అంతస్తులో ఎగసిపడిన మంటలు!
ఇదిలాఉండగా.. ఇటీవలే పాకిస్థాన్‌లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో బొగ్గు గని కార్మికులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గతంలో చాలాసార్లు పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఇప్పడు మళ్లీ మసీదు వద్ద బాంబు పేలుడు జరగడం సంచలనం రేపుతోంది.
Also Read: సీఎం కార్యాలయాన్ని బూడిద చేస్తాం.. పాకిస్తాన్ నంబర్‌తో బాంబు బెదిరింపులు..!