హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..!

తెలంగాణ నూతన AICC ఇన్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

author-image
By K Mohan
New Update
AICC menakshi natarajan

AICC menakshi natarajan Photograph: (AICC menakshi natarajan)

తెలంగాణ నూతన AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. సింపుల్‌గా ఎలాంటి హంగామా లేకుండా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌ గౌడ్ ఆమెకు స్వాగతం పలికారు. హైదరాబాద్ రాగానే ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. దీపా దాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా గత కొన్ని రోజుల క్రితమే మీనాక్షి నటరాజన్‌ని ప్రకటించింది అధిష్టానం. 

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నాటరాజన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. గతకొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వర్గ విభేదాలు వస్తున్నాయి. పార్టీలో ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్, మంత్రులపై అధిష్టానానికి ఫిర్యాదులు చర్ఛనీయాంశంగా మారాయి. అంతేకాదు ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి ఎక్కువైతున్నా.. మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత కూడా ఆమె పైనే ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖత ఆమెకు పెద్ద పరీక్షగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సరైన నిర్ణయాలు మీనాక్షి నటరాజన్ తీసుకోవాలి. అధికార కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం ధీటుగా ఎదుర్కోంటుంది. మంత్రుల మధ్య సంఖ్యత కూడా లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు