Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. సమారు 4 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో విలీనానానికి ఆమోదించారు.

New Update
CM Revanth

CM Revanth

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్‌(Telangana Cabinet) భేటీ ముగిసింది. సమారు 4 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో విలీనానానికి ఆమోదించారు. మూడో డిస్కం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీని పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్స్‌ను తీసుకురానున్నారు. అలాగే రానున్న పదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ అవసరాల ఏర్పాట్లపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించి టెండర్లు పిలస్తామని పేర్కొన్నారు. 

Also Read: అయ్యప్ప దీక్షలో డ్యూటీ చేయకండి.. పోలీసు శాఖ సంచలన ఆదేశం

Telangana Cabinet Meeting Updates

అలాగే 2 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ కొనుగోలుకు ఆమోదం తెలిపారు. కొత్త పరిశ్రమలకు తమ సొంతంగానే విద్యుత్‌ను తయారీ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. NTPC ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణానిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాల్వంచ, మక్తల్‌లో కూడా ప్లాంట్లు నిర్మించే ఛాన్స్‌పై పరిశీలించారు. హైదరాబాద్‌ను మూడు సర్కిళ్లుగా విభజించచి భూగర్భ కేబుల్‌ విద్యుత్ వ్యవస్థతో పాటు టీఫైబర్ కేబుళ్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు.  

Also Read: తెలంగాణ సర్పంచ్ రిజర్వేషన్లలో చిత్రాలు.. ఈ లెక్కలు చూస్తే నవ్వుతారు!

భద్రాద్రి జిల్లాలోని దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా స్కూల్‌ ఏర్పాటు చేసేందుకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్‌ కోసం 40 ఎకరాలు కేటాయించారు. జూబ్లీహిల్స్‌తో సహా రాష్ట్రంలో మరిన్ని అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు