Telangana Police: అయ్యప్ప దీక్షలో డ్యూటీ చేయకండి.. పోలీసు శాఖ సంచలన ఆదేశం

మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు తీసుకుంటే సెలవులు తీసుకోవాలని.. డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది.

New Update
no uniform exemption for Ayyappa Deeksha, Says Telangana Police

no uniform exemption for Ayyappa Deeksha, Says Telangana Police

మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ(telangana-police) సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు తీసుకుంటే సెలవులు తీసుకోవాలని.. డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎస్సైకి మెమోను జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే కాంచన్‌బాగ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్ (SI) ఎస్‌.కృష్ణకాంత్‌ అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. డ్యూటీలో నల్లటి దుస్తులు ధరించడంతో పాటు జుట్టు, గడ్డం కూడా ఆయన పెంచుకున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ (ADCP) శ్రీకాంత్.. కృష్ణకాంత్‌కు మోమో జారీ చేశారు. దీంతో ADCPపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 

Also Read: స్నేహమంటూనే చైనా మరో కుట్ర.. సరిహద్దుల్లో డ్రోన్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు

No Uniform Exemption For Ayyappa Deeksha

మరోవైపు పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja Singh) అభ్యంతరం వ్యక్తం చేశారు. మన పండగుల జరిగే సమయంలో ఎవరైనా దీక్ష చేస్తే పోలీసు శాఖ అవసరం లేని రూల్స్‌ను ఎందుకు జారీ చేస్తుందని ప్రశ్నించారు. ఒక నింబంధన అందరికీ వర్తించాలని.. సమాజం ఆధారంగా ఉండకూడదన్నారు. పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు జట్టు, గడ్డం పెంచుకోవడం, బూట్లు లేకుండా సివిల్ డ్రెస్ ధరించేందుకు పర్మిషన్ ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆ మెమోలో శ్రీకాంత్‌ తెలిపారు. ఒకవేళ పోలీసులు దీక్ష తీసుకోవాలనుకుంటే వాళ్లు లీవ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 

Also Read: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌..పెరిగిన స్పాట్‌ బుకింగ్స్‌

పోలీసు శాఖ పంపిన ఆ ఆదేశాలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఈ నిబంధనను విశ్వ హిందూ పరిషత్ (VHP) తెలంగాణ యూనిట్‌ తీవ్రంగా ఖండించింది. ఏడీసీపీపై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను అభ్యర్థించింది. అయ్యప్ప దీక్ష పాటించారని ఎస్సైకి మెమో జారీ చేయడమే హిందూ వ్యతిరేకం అంటూ ధ్వజమెత్తింది. గతంలో కూడా పోలీసులు అయ్యప్ప దీక్షలో ఉంటూ డ్యూటీ చేయరాదంటూ నోటీసులు జారీ చేయడంపై వివాదాలు చెలరేగాయి.  

Advertisment
తాజా కథనాలు