TG Politics: రాజగోపాల్ రెడ్డి బాటలో మరో ఎమ్మెల్యే.. నాకే మంత్రి పదవి రాకుంటే.. వీడియో వైరల్!

మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్‌కు అన్యాయం చేసినట్లేనని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించనన్నారు. ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి.

New Update
TG Cabinet Expansion Komatireddy Revanth Reddy

TG Cabinet Expansion Komatireddy Revanth Reddy

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ కామెంట్లు చేశారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్‌కు అన్యాయం చేసినట్లేనన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరిపోశానని గుర్తు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించనని స్పష్టం చేశారు. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. పదేళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా గౌరవం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రేమ్ సాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: Bhu Bharati Act: నేటి నుంచే 'భూ భారతీ'.. ధరణిలో లేని అనేక ప్రత్యేకతలు.. పోర్టల్ హైలైట్స్ ఇవే!

Also Read :  మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. వారి వద్ద ఏం దొరికాయో తెలుసా?

Also Read :  ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఏసీ టెంపరేచర్‌ ఎంత ఉండాలి?

వివేక్ పై విమర్శలు..

బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓ కుటుంబం మంత్రి పదవి రాకుండా నా గొంతు కోసేందుకు ప్రయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జై బాబు జై భీమ్ జై సమ్మిదాన్ సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలోనే ప్రేమ్ సాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: SC Classification : నెరవేరిన దశాబ్ధాల కల....ఎస్సీ వర్గీకరణకు జీవో విడుదల

నిన్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి వర్గ విస్తరణపై హాట్ కామెంట్లు చేశారు. జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బతకాలంటే తన లాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వాలన్నారు.

 

mla komatireddy rajagopal reddy | latest-telugu-news | telugu breaking news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు