/rtv/media/media_files/2025/04/14/3IufBGDTfwrHTnUHTXUP.jpg)
SC Sub-Categorization
SC Classification : ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కులాలకు గ్రూప్-బీ కింద ఉన్న వారికి 9 శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలను గ్రూప్-సీ కింద ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి.
Also Read: Big Breaking: సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని మళ్ళీ బెదిరింపు..ఈసారి ఇంట్లోకి దూరి మరీ..
ఈ జీవో విడుదలతో షెడ్యూల్డ్ కులాల్లో (ఎస్సీ) బాగా వెనుకబడి, రిజర్వేషన్ల ఫలాలను సరిగా పొందలేకపోయిన కులాల కల నెరవేరనుంది. రాష్ట్రంలో ఎస్సీలకు ఇప్పటివరకు అమలైన 15శాతం రిజర్వేషన్లు.. ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు, కులాల ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక ఇప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గమనార్హం.
Also Read: VIRAL VIDEO: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్
ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. దీనికోసం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా పరిశీలన జరిపి.. ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక అందజేసింది. కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్‌ను విభజిస్తున్నట్టు ఫిబ్రవరి 4న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది.
జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, జనాభా శాతం ఆధారంగా 15 శాతం రిజర్వేషన్‌ను పంచింది. గ్రూప్-1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చి 1శాతం, గ్రూప్-2లో మాదిగ, దాని ఉప కులాలను కలిపి 18 కులాలకు 9శాతం, గ్రూప్-3లో మాల, దాని ఉపకులాలు 26 కులాలకు 5శాతం రిజర్వేషన్‌ను కేటాయించింది.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
గ్రూప్-1లో 1,71,625 మంది (3.288శాతం), గ్రూప్-2లో 32,74,377 మంది (62.748శాతం), గ్రూప్-3లో 17,71,1682 మంది (33.963శాతం) జనాభా ఉన్నారని పేర్కొంది. గ్రూప్-1లోని కులాల వారితో ఖాళీలు భర్తీ కాకపోతే.. గ్రూప్-2లోని వారితో, గ్రూప్-2లో భర్తీకాని ఖాళీలను గ్రూప్-3లోని కులాల వారితో భర్తీ చేయాలని సూచించింది. ఒకవేళ ఈ మూడు గ్రూపుల్లో తగిన అభ్యర్థులు లేకపోతే ఖాళీలను తర్వాతి నోటిఫికేషన్‌కు కొనసాగించాలని పేర్కొంది. ఈ వివరాలన్నింటిని క్రోడికరించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎస్సీలను ఎబీసీడీలుగా వర్గీకరించి రిజర్వేషన్లను అమలుచేయాలనే డిమాండ్‌తో ఎస్సీల్లోని వెనుకబడిన కులాలు మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. వారి కల ఇన్నేళ్లకు నెరవేరింది.
Also Read: కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక