/rtv/media/media_files/2025/04/14/sJNLd8OJDdjMwoqSzMKv.jpg)
CM Revanth Reddy Good News To Farmers for Bhu Bharati Portal t
Bhu Bharati Act: అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్ 'భూ భారతి'నేటినుంచి అమల్లోకి తీసుకొస్తుంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కొత్త చట్టం, పోర్టల్‌ను ఆవిష్కరించేందుకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేసింది. ఆర్వోఆర్-2020 స్థానంలో ఆర్వోఆర్-2025 'భూభారతి' చట్టాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అమలు చేయనున్నారు.
33 నుంచి 6కు కుదింపు..
మొదట ఈ ప్రయోగాన్ని 3 మండలాల్లో అమలు చేయనుండగా.. దాని ఫలితాల ఆధారంగా జూన్ 2 నుంచి పూర్తిస్ధాయిలో అమల్లోకి తీసుకురానున్నారు. మొదట పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ఒక్కో మండలాన్ని ఎంపిక చేయనున్నారు. ఆయా మండలాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల సందేహాలను నివృత్తి చేస్తారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా పోర్టల్ సులభమైన భాషలో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. తర్వాత రాష్ట్రంలోని ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇక ధరణిలో 33 మాడ్యూళ్లు ఉండగా.. మాడ్యూల్‌ను ఎంపికలో అనేక ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా కొత్త పోర్టల్‌లో మాడ్యూళ్ల సంఖ్యను 6కు కుదించారు.
భరోసా, భద్రత కల్పించడమే లక్ష్యం..
అలాగే 2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం తమకు రిఫరెండమని శాసనసభలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. భూములపై రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి భరోసా, భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించినట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక భూ భారతి అమలులోకి వచ్చిన వెంటనే ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు.
Also Read : కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
కుటుంబ సభ్యులకు తెలిసేలా నోటీసులు..
ఇర వారసత్వ బదిలీ అంశాన్ని కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసుల జారీ చేయనున్నారు. విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందులోనే ఉండగా.. ఈ -పహాణీని 11 కాలమ్‌లతో తీసుకొస్తున్నారు. ధరణిలో భూ యజమాని పేరుతోపాటు భూ ఖాతా, సర్వే నంబరు, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలు ఉండనున్నాయి. సామాన్య రైతుకు కూడా భూ భారతి అర్థం అయ్యేలా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. కనీసం వందేళ్లపాటు వెబ్‌సైట్ ఉంటుందని, భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: గ్రాఫిక్స్ గాలికి వదిలేశారా..? విశ్వంభరపై 'బన్ని' ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్
అవసరాలకు తగినట్లు 11 కాలమ్స్..
భూ భారతిలో ఎమ్మార్వో స్ధాయి నుంచి సీసీఎల్ వరకు 5 స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాలు వికేంద్రీకరణ చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు. తర్వాత కాలంలో సమస్యలు తగ్గితే ట్రిబ్యునల్స్‌ను కుదించనున్నారు. పోర్టల్లో దరఖాస్తు చేస్తే ఇకపై భూ యజమాని ఫోన్ నంబరుకు మెసేజ్ వస్తుంది. ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. గతంలో పోర్టల్లో భూ దస్త్రాలన్నీ కనిపించేవి కావు. కానీ ఇప్పుడు ఎవరివైనా, ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసుకోవచ్చు. వ్యవసాయ భూముల పూర్తి సమాచారాన్ని తిరిగి నమోదు చేసేందుకు ప్రభుత్వం పహాణీ కాలమ్‌లను పునరుద్ధరించింది. గత ప్రభుత్వం వాటన్నింటినీ తొలగించి పట్టాదారు పేరు మాత్రమే ఉండేలా పహాణీని అమలు చేయగా.. భూముల వివరాల లభ్యత లేక అనేక సమస్యలు తలెత్తాయి. ధరణి కమిటీ గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రస్తుత అవసరాలకు తగినట్లు 11 కాలమ్‌లతో కొత్త పహాణీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
Bhu Bharathi | telugu-news | today telugu news