Hyderabad Crime : కొత్త రకం దొంగలొస్తున్నారు జాగ్రత్త...

భవన నిర్మాణానికి వినియోగించే సామగ్రి,సెంట్రింగ్‌ వస్తువులను దొంగిలిస్తున్నఆడ దొంగల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లను టార్గెట్ గా చేసుకొని నిందితులు సెంట్రింగ్ ప్లేట్లు, ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తారు.

New Update
Gang of female thieves

Gang of female thieves

 Gang of female thieves :నలుగురు ఆడవాళ్లు కలిస్తే చీరల గురించో..నగల గురించో మాట్లాడుకుంటారు. ఇంకా కావాలనుకుంటే వంటల గురించి మాట్లాడుకుంటారు. కానీ ఈ ఆడవాళ్లు కలిస్తే మాత్రం ఈ రోజు ఎక్కడ కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది. అక్కడ సెంట్రింగ్‌ పనులు జరుగుతున్నాయా? సెక్యూరిటీ ఉందా లేదా అని మాట్లాడుకుంటారు. అలా అని అక్కడ పనికి కుదరడానికి అనుకుంటే తప్పులో కాలేసినట్లే.  భవన నిర్మాణానికి వినియోగించే సామగ్రి, సెంట్రింగ్‌ వస్తువులు వారి కంట పడితే చాలు మాయమవ్వాల్సిందే. కానీ చేసిన పాపం ఎన్నాళ్లు సాగుతుంది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది ఈ ఆడదొంగల ముఠా. 

Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మియాపూర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ క్రాంతి కుమార్‌, డీఐ రమేష్‌ నాయుడుతో కలిసి ఈ ముఠా వివరాలు వెల్లడించారు. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన ముడావత్‌ పద్మ, నెనావత్‌ విజయ, బిల్లావత్‌ లక్ష్మీ, నెనావత్‌ అమృత, సభావత్‌ సునిత, వాడిత్య అనిత, ఆటోడ్రైవర్‌ నెనావత్‌ చందర్‌ ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో భారీ భవన నిర్మాణ సముదాయాల వద్ద సెంట్రింగ్‌ సామగ్రి, ఇతర విలువైన వస్తువుల చోరీకి పాల్పడుతున్నారు. వీరిలో ఒకరు ఉదయం వేళల్లో కాలనీల్లో తిరుగుతూ సెక్యూరిటీ లేని భవనాలను ఎంచుకుని ముఠా సభ్యులకు సమాచారం అందిస్తారు. 

Also Read:CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

రాత్రి అందరూ కలిసి ట్రాలీ ఆటోలో తాము ఎంచుకున్న భవనం వద్దకు చేరుకుంటారు. అదను చూసుకుని సెంట్రింగ్‌ సామగ్రి, ఇతర విలువైన వస్తువులను ఆటోలో వేసుకుని ఉడాయిస్తారు. అనంతరం వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. గత నెల 19న వీరు అర్ధరాత్రి మియాపూర్‌లోని ఓ భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్‌ సామగ్రి చోరీకి చేశారు. భవన యజమాని ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడికెళ్లారంటే ?

 అనుమానంతో పోలీసులు ఆ భవనం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితులు పద్మ, విజయ, లక్ష్మీ, అమృత, సునిత, అనిత, చందర్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. కాగా ఈ ముఠా గతంలోనూ పలు చోరీలకు పాల్పడింది. వీరిలో ముడావత్‌ పద్మపై 16, విజయపై 7, అమృతపై 1, సునిత 2 కేసులున్నట్లు తెలిపారు. వీరు గతంలో జైలుకు వెళ్లి వచ్చినా తమ వైఖరి మార్చుకోకుండా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు రూ.7లక్షల సెంట్రింగ్‌ సామగ్రీ, రెండు ఆటోలను స్వాధీనం చేసున్నారు.

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!

Advertisment