Thieves : కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో దొంగతనం.. వీడియోలు వైరల్
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతు పట్వారీ ఇంట్లో దొంగతనం జరిగింది. ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతు పట్వారీ ఇంట్లో దొంగతనం జరిగింది. ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
కరుడుకట్టిన హరియాణా దొంగల ముఠా ఒకటి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ పోలీసులను కారుతో తొక్కించేయత్నం చేసింది. దీంతో పోలీసులు వారిపైకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని కుప్పంలో కలకలం రేపింది. పారిపోయిన దొంగల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కర్నాటకలో మంగోలి కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో 59Kgల బంగారం చోరి అయ్యింది. మే 26న ప్యూన్ బ్యాంక్ దగ్గరకు వచ్చి చూడగా.. షట్టర్ తాళాలు కత్తిరించి ఉన్నాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్న వారి బంగారం చోరికి గురైంది.
భవన నిర్మాణానికి వినియోగించే సామగ్రి,సెంట్రింగ్ వస్తువులను దొంగిలిస్తున్నఆడ దొంగల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లను టార్గెట్ గా చేసుకొని నిందితులు సెంట్రింగ్ ప్లేట్లు, ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తారు.
అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్ మెన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలను కొట్టేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలతో దొంగలు హల్చల్ చేశారు. కొత్తచెరువు, ఓబుల దేవర చెరువు మండల కేంద్రాల్లోని దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. రెండు దుకాణాలతో పాటు కిరాణాషాప్ లో నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.