కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడికెళ్లారంటే ?

కర్రెగుట్టలను బుధవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టుల జాడ మాత్రం కనిపించలేదు. దీంతో వాళ్లు కర్రెగుట్టలను ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతంలోకి వెళ్లారని సమాచారం.

New Update
Operation kagar Forces Set up Base Camp in Karreguttalu

CRPF Set up Base Camp in Karreguttalu

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కర్రెగుట్టలను బుధవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్‌ సక్సెస్‌కు గుర్తుగా అక్కడ జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో గత పదిరోజులుగా సాయుధ బలగాలకు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. మొత్తంగా 20 వేల మంది సాయుధ బలగాలు అన్ని వైపుల నుంచి సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించాయి.

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

చివరికి కర్రెగుట్టలో 5 వేల అడుగుల ఎత్తువరకు వెళ్లి అక్కడ జెండా ఎగురవేశాయి. అలాగే ఆ ప్రాంతంలోనే బేస్‌ క్యాంపు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్యాంప్‌లో దాదాపు 10 వేల సిబ్బంది భాగం అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ క్యాంపు సమీపంలో భారీ సెల్‌ టవర్స్‌ కూడా ఏర్పాటు చేశారు. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

అయితే ఇక్కడ కర్రెగుట్టలోని దోహి కొండ, నీలం సారాయి కొండలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ.. ఈ 10 రోజుల్లో మావోయిస్టుల జాడ మాత్రం ఏమాత్రం కనిపించలేదు. దీంతో వాళ్లు కర్రెగుట్టలను ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతంలోకి వెళ్లిఉంటారనే ప్రచారం నడుస్తోంది. కానీ భద్రతా బలగాలు మావోయిస్టులు వదిలేసిన షెల్టర్ జోన్లు, బంకర్లను గుర్తించాయి.  వాళ్లు భూగర్భంలోని రహస్య స్థావరాల్లో ఉండే ఛాన్స్ ఉందని కూడా అనుమానిస్తున్నారు. దీంతో మావోయిస్టులు స్థావరాల నుంచి బయటకు వచ్చేవరకు వేచి చూడాలని బలగాలు భావిస్తున్నాయి.  

Also Read: ఇండియా, పాక్ సరిహద్దులు క్లోజ్.. ఈరోజుతో రాకపోకలు బంద్

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!

maoist | telugu-news | rtv-news | national-news | crpf 

Advertisment
Advertisment
తాజా కథనాలు