Happy50 Suriya: మీ ఫేవరేట్ హీరో సూర్య గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలివే!

నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సినీతారల నుంచి విషెష్ వెలువెత్తుతున్నాయి. ఎక్కడ చూసిన ఆయన పోస్టర్స్, మ్యాషప్ వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది

New Update
HBD Suriya

HBD Suriya

Happy50 Suriya: భాషకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోల్లో  కోలీవుడ్ స్టార్  సూర్య ఒకరి. తమిళ్ హీరో అయినప్పటికీ.. ఆయనకు తెలుగులోనూ  భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గజినీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, యముడు, సింగం, ఆకాశమే నీ హద్దురా వంటి సినిమాలు ఆయనను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. టాలీవుడ్  హీరోలతో సమానంగా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు! నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సినీతారల నుంచి విషెష్ వెలువెత్తుతున్నాయి. ఎక్కడ చూసిన ఆయన పోస్టర్స్, మ్యాషప్ వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది.  ఈరోజుతో సూర్య 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. 

అసలు పేరు సూర్య కాదు!

హీరో సూర్య గురించి ఈ విషయం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అయితే సూర్య అసలు పేరు శరవణన్ శివకుమా, కానీ సినిమాల్లోకి వచ్చాక.. డైరెక్టర్ మణిరత్నం సూర్య అనే పేరును సూచించారట. అదే ఆయన స్క్రీన్ నేమ్ గా మారిపోయింది. 

సినిమా ఆసక్తి లేదు

సూర్య తండ్రి శివకుమార్ తమిళ్లో ప్రముఖ నటుడు! ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని సూర్య సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. మొదట్లో సూర్యకు నటన అంటే పెద్దగా ఆసక్తి ఉండకపోయేదట. అలా 1995లో ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత 1997లో "నెరుక్కు నేర్" సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 

HBD Suriya
HBD Suriya

పదేళ్ల కష్టం 

సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. సినిమాల్లోకి రాగానే సూర్యకు విజయం దక్కలేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి దాదాపు పదేళ్లు కష్టపడ్డారు. 2001 లో  'నందా' సినిమాతో బ్రేక్ వచ్చింది.   "కాఖా కాఖా, గజినీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, సురరై పొట్రు వంటి సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. 

జ్యోతిక, సూర్య తొలి సినిమా 

సూర్య జ్యోతికను కలిసిన సమయంలో.. ఆమె అప్పటికే తమిళ్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.  సూర్య జ్యోతిక మొదటగా  'పూవెల్లం కెట్టుప్పర్' సినిమాలో కలిసి నటించారు. 

suriya- jyothika
suriya- jyothika

అగరం ఫౌండేషన్!

సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ  ముందుంటారు సూర్య. 2008లో ఆయన "అగరం ఫౌండేషన్"ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు, అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 

నిర్మాతగా కూడా

సూర్య నటుడిగానే కాకుండా, నిర్మణ రంగంలోనూ సక్సెస్ ఫుల్ అయ్యారు.  2013లో  "2డి ఎంటర్టైన్మెంట్" నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు.

నేషనలో అవార్డు 

సూర్య నటించిన "సూరరై పొట్రు" దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో సూర్య నటనకు ఉత్తమ నటుడిగా జాతీయా అవార్డు వరించింది.

Also Read: Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు బ్రేక్!

#telugu-news #HBD Suriya
Advertisment
తాజా కథనాలు