అమ్రాబాద్ అడవిలో గుర్తు తెలియని వ్యక్తి | unknown person in Amrabad forest | Nagar Kurnool | RTV
నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. వనపట్లలో భారీవర్షానికి మట్టిమిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తల్లి గొడుగు పద్మ, ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన తండ్రి భాస్కర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలవడంతో ప్రముఖ నేతలు అందరూ తమ నామినేషన్లను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈమధ్యనే బీఆర్ఎస్లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో న్యాయ విచారణ కోసం కేంద్ర సాయం కోరితే సహకరిస్తామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. 2019లో నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచిన రాములు.. బీఆర్ఎస్తో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆయన ఎంపీ పోటీ చేసే ఛాన్స్ ఉంది.
తాంత్రిక పూజలతో గుప్తనిధులు చూపించి ధనవంతులను చేస్తానని 11 మందిని హతమార్చిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. ప్రశ్నించిన బాధితులకు జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తీర్థం పేరిట తాగించి అపస్మారకస్థితికి చేరుకోగానే బండరాయితో కొట్టి చంపిన సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడనున్నట్లు సమాచారం. నాగం నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నాగం మరో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ లో చేరే ఛాన్స్ ఉంది. ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ తో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ అవుతారని సమాచారం.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకొని సృహ కోల్పోయిన 14 మంది విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది స్థానిక అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.