/rtv/media/media_files/2025/07/23/jagdeep-dhankhad-2025-07-23-13-13-48.jpg)
జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామాతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అనూహ్యంగా ఆయన రాజీనామా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. మరో రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీచేశారు. ఆరోగ్య కారణాలను పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. దీంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఇక ప్రస్తుతం రాజ్యసభ చెర్మన్ పదవి ఖాళీ అయిపోయింది.
రేస్‌లో ఐదుగురు..?
ఈక్రమంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఇక దక్షణాది నుంచి నిర్మలా సీతారామన్, దగ్గుపాటి పురందేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నియామకం సందర్భంలో కూడా ఈ ఇరువురి మహిళల పేర్లు బాగా వార్తల్లో నిలిచాయి. అంతేకాదు ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు కూడా వినిపిస్తోంది.
నితీష్ కుమార్
నితీష్ కుమార్ కొన్నేళ్లపాటూ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఆయన్ని సీఎం కుర్చీ నుంచి తప్పించి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నిశీత్ కూడా ఉపరాష్ట్రపతి పదవి ఆశిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది.
ఎంపీ శశిథరూర్
ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ గత కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్యలను సమర్థిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతలే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయినా అవేవీ పట్టించుకోకుండా విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు. త్వరలో ఆయన హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం పార్టీతో జతకట్టే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వేళ ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పేరు తెరపైకి వచ్చింది.
నిర్మలా సీతారామన్, దగ్గుపాటి పురందేశ్వరి
దక్షణాదిలో బీజేపీ ప్రాబల్యం పెంపొందాలంటే పెద్ద పదవులు సౌత్ స్టేట్‌కు చెందిన నాయకులకు ఇవ్వాలి. ఇప్పటికే బీజేపీ దక్షణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ఉపరాష్ట్రపతి పదవి తమిళనాడు, తెలుగు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి ఇస్తే బ్యాలెన్స్ చేయోచ్చని ఈవ్వేషన్స్ వస్తున్నాయి. ఈక్రమంలో చూస్తే దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో సీనియర్ లీడర్‌గా ఉన్నారు. ప్రస్తుతం లోక్ సభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూతురు కావడంతో ఎన్డీయే పొత్తులో భాగంగా ఆమెకు ఆ పదవి ఇస్తే టీడీపీ కూడా సంతోషిస్తోంది. ఇక ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పని చేస్తున్న నిర్మలా సీతారామన్ కూడా ఉపరాష్ట్రపతి రేస్‌లో ఉన్నారు. కొంత కాలంగా బీజేపీ ట్యాక్స్ విధానంపై ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. ఈక్రమంలో ఆమెకు రాజ్యసభ చెర్మన్ పదవి ఇచ్చి శాశ్వత రాజకీయాలకు దూరం చేస్తే.. కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకను మాయం చేయోచ్చు అనే ఆలోచనలో బీజేపీ ఉంది.
పోటీలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారు. ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లేదంటే ఢిల్లీ ఎల్జీ సక్సేనాలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చనడుతస్తోంది. అయితే, దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.