AP : కేజీ నేరేడు పండ్ల కోసం కొట్లాట.. వీధి వ్యాపారిపై పంచాయితీ సెక్రటరీ దౌర్జన్యం..!
పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో వీధి వ్యాపారిపై పంచాయితీ సెక్రటరీ రెచ్చిపోయాడు. కేజీ నేరేడు పండ్లు 50 రూపాయలకు ఇవ్వనందుకు వ్యాపారి తోపుడు బండి మీద వున్న కాటా తీసుకెళ్ళిపోయాడు. రోడ్డుపై వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానంటూ సెక్రటరీ బెదిరింపులకు దిగాడు.