/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)
Heavy rain again
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే గురువారం మరో అల్పపీడనం ఏర్పడనుంది . ఈ నేపథ్యంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ సంస్థ వెల్లడించింది. మంగళ, బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో, గురు, శుక్రవారం కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ఇవాళ తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట.. సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్..భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది--- మరోవైపు తెలంగాణ(heavy rain alert for telangana) లో ఈ నెల 25-,27 మధ్య కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది.
AP-TG Heavy Rain Alert
ఇవాళ ఏపీ లోని పలు జిల్లాలలో కూడా భారీ వర్షాలు(heavy rain alert ap) కురిసే అవకాశం ఉంది.4 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని IMD తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి..ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్ప పీడనం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్శాలు కురస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ,ఎన్టీఆర్,ఏలూరు,తిరుపతి, నెల్లూరు,నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు తో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండొద్దని సూచించింది. అలాగే పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని.. పొలాలలో పనిచేసే కూలీలు, రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
Read: Kantara Chapter-1 Trailer: 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!