Kantara Chapter-1 Trailer: 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ ప్రీక్వెల్ 'కాంతార 2' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

New Update

 Kantara 2 Trailer:   కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన  'కాంతార: చాప్టర్ 1' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.   2022లో విడుదలైన బ్లాక్ బస్టర్   'కాంతార' ప్రీక్వెల్ గా దీనిని  రూపొందించారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు ఆయన స్వయంగా దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను వివిధ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేయగా.. హిందీలో హృతిక్ రోషన్, తమిళ ట్రైలర్‌ను శివ కార్తికేయన్, మలయాళ ట్రైలర్‌ను పృథ్వీరాజ్ సుకుమారన్ లాంచ్ చేశారు.

ట్రైలర్ వచ్చేసింది.. 

ట్రైలర్ చూస్తుంటే..  మొదటి భాగం కంటే రెండవ భాగం భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  క్రీ.శ. 300 కాలంలోని  కదంబ రాజవంశం పాలన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.  కదంబ రాజవంశంలోని ఒక క్రూరమైన  రాజు  అతడి పాలనలోని  'కాంతార' ప్రజలను అణిచివేతకు గురిచేస్తుంటారు. ఆ సమయంలో ప్రజలను రక్షించడానికి  బేర్మ అనే యోధుడు (రిషబ్ శెట్టి)  జన్మిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే   కనిపించే సినిమాలో  భూత కోల / దైవ కోల సంప్రదాయం మూలలను కూడా చూపించారు. 

ట్రైలర్ లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, అజినీష్ లోకనాథ్ బీజేఎం హైలైట్ గా అనిపించాయి.  మొదటి భాగం కంటే రెండవ భాగం భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం రూ. 16 కోట్లతో చిన్న సినిమాగా విడుదలైన  'కాంతార' బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పై వసూళ్లు సాధించింది. దీంతో ప్రీక్వెల్‌ను (కాంతార: చాప్టర్ 1) భారీ అంచనాలతో తెరకెక్కించారు. 

మొదటి భాగం కంటే ఈ సినిమా మరింత పెద్ద బడ్జెట్‌తో నిర్మించబడింది. మొదటి భాగం కేవలం ₹16 కోట్లతో నిర్మించబడి ₹400 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రీక్వెల్‌ను భారీ అంచనాలతో తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబోలె ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటించగా.. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Also Read: OG TRAILER: బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త... పూనకాలు తెప్పిస్తున్న 'OG' ట్రైలర్

Advertisment
తాజా కథనాలు