Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.