BIG BREAKING: గ్రూప్-1పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలు అయిన పిటిషన్‌ను కొట్టేసింది.

author-image
By V.J Reddy
New Update
SUPREME COURT

GROUP 1 EXAMINATIONS: తెలంగాణలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ పరీక్షా వాయిదా వేయాలంటూ గ్రూప్ -1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. గ్రూప్ -1 పరీక్ష నోటిఫికేషన్ రద్దుతో పాటు మెయిన్స్ పరీక్ష వాయిదాకు ధర్మసనం నిరాకరించింది. గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. TGPSC విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారంగానే పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.

Also Read: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే!

హైకోర్టు తీర్పుకు సై..!

గతంలో కొందరు అభ్యర్థులు కొత్త నోటిఫికేషన్‌ చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. TGPSC నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లో 14 తప్పులున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ వాయిదా వేయాలని హైకోర్టును కోరారు. కాగా అభ్యర్థులు వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. గ్రూప్ 1 పరీక్షలు యథాతంగా జరుగుతాయని స్పష్టం చేసింది. 

Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!

హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించిన అభ్యర్థులు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ పరీక్షలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడింది. కోర్టుల జోక్యంతో నియామకాల్లో తీవ్ర ఆలస్యం జరుగుతుందని చెప్పింది.

Also Read:  విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్

Also Read: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు