/rtv/media/media_files/2024/12/06/DpN3oUbRzFv9CEA0uqeB.jpg)
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పశ్చిమ్ బెంగాల్ కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)- సౌత్ ఈస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SER పరిధిలోని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Also Read : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా?
మొత్తం 1,785 అప్రెంటిస్ ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,785 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే 01.01.2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?
ఫిట్టర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, లైన్‌మ్యాన్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, టర్నర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ తదితర ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక దీని ఎంపిక విధానం విషయానికొస్తే..
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్
అభ్యర్థులను మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అందువల్ల ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 28, 2024న ప్రారంభం అయింది. డిసెంబర్ 27, 2024 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.