/rtv/media/media_files/2025/06/24/supreme-court-2025-06-24-21-31-15.jpg)
Supreme Court
Supreme Court: తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీం కోర్టు సమర్థించింది. గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందే అన్న నిబంధనను సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
Also Read: దారుణం.. ఆస్తిలో వాటా ఇవ్వాలని.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన కొడుకులు!
పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసమే
తెలంగాణకు చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ర్ట ప్రభుత్వ స్థానికత అంశాన్ని తీసుకొచ్చిందని అంతకు ముందు ప్రభుత్వ తరుపున న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న సంపన్న విద్యార్థులు లండన్, దుబాయ్ సహా ఇతర విదేశాలకు వెళ్లి 11, 12వ తరగతి చదువుకుంటారు. వారికి ఎక్కడైనా సులభంగా మెడికల్ సీట్లు పొందడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి అవకాశాలు లేకుండా తెలంగాణ స్థానికతలో చదువుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనను తీసుకొచ్చామని వివరించారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) ప్రకారమే ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలకు ప్రభుత్వ విద్య, ఉపాధి అవకాశాల్లో సమాన అవకాశాలు, సౌకర్యాలు అందాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వేర్వేరు నిబంధనలు చేయవచ్చని అందులో ఉందని చెప్పారు.
Also Read: మెట్రో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..!
సివిల్ సర్వీసెస్, తదితర ఉద్యోగాల్లో భాగంగా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల అక్కడ చదువుకున్న పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు వివరించారు. లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టి కోణంతో ఆలోచించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అసోం, హరియాణా రాష్ట్రాలలో స్థానికత కేసుల్లో తీర్పులను ప్రస్తావించారు. స్థానిక పాఠశాలలో తప్పనిసరిగా10, 11, 12 చదవాలని హరియాణా రాష్ర్ట నిబంధనలు చెబుతున్నాయన్నారు. అసోంలో 7-12 స్థానికంగా చదివితేనే మెడికల్ అర్హత పరీక్షకు అనుమతిస్తున్నారని వివరించారు. ఏపీలోనూ స్థానికత అమలవుతోందని వెల్లడించారు. ఒక్క తెలంగాణ విద్యార్థికి కూడా ఏపీలో అవకాశం కల్పించడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మెడికల్ సీట్లు ఖర్చుతో కూడుకున్నవని, అవి ఎంతో ఖరీదైనవని, పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువ డబ్బులు వెచ్చించి చదివే పరిస్థితి లేదని చెప్పారు. స్థానికత పూర్తి స్థాయిలో వర్తిస్తేనే రాష్ట్రంలోని విద్యార్థులకు న్యాయం జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read:Human GPS Bagu Khan : వీడో హ్యూమన్ జీపీఎస్..చొరబాట్ల దారులన్నీ వీడి మైండ్‌లోనే...