Stray Dog Attack: తెలంగాణలో గుండె పగిలే విషాదం.. మూడేళ్ల బాలుడి ప్రాణం తీసిన కుక్కలు
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్లాతండాలో వీధికుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు నిథున్ మరణించాడు. కిరాణా షాపు నుంచి వస్తుండగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తండాలో విషాదం నింపింది.