/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t132808252-2025-11-08-13-28-59.jpg)
Strangers left 2,000 native hens in that village.. People celebrated
మాములుగా కోడి మాంసం అనగానే అందరూ ఎగిరి గంతేస్తారు. అలాంటిది నాటు కోడి అంటే ఇక చెప్పనక్కరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నాటుకోళ్లు(Hens) పెంచుకుంటూ ఉంటారు. కోళ్లు పెద్దవి అయ్యాక వాటిని అమ్మడం గాని, ఏదైనా పండుగల సమయంలో వాటిని కోసుకొని తినడం గానీ చేస్తుంటారు. పండుగల సమయంలో ఇంట్లో పెంచుకున్న నాటు కోళ్లను తినేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. నాటు కోళ్లకు మాములు కోళ్లతో పోలిస్తే ధర కూడా ఎక్కువే. అయితే, ఒక గ్రామంలోని ప్రజలు మాత్రం ఒక్క పైస పెట్టకుండా నాటుకోళ్లు తెచ్చుకున్నారు. అవును లక్కీ ఛాన్స్(feel-lucky) అంటే వారిదే మరి. అసలేం అయిందంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ గ్రామంలో నాటు కోళ్లను తీసుకొచ్చి వదిలేశారు. దీంతో కోళ్ళన్నీ పొలాల చుట్టూ కనిపించాయి. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read : నా మాటే శాసనం.. మద్యం వ్యాపారాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మూడు కండిషన్స్!
Strangers Left 2,000 Native Hens
దీంతో నాటు కోళ్లను తెచ్చుకోవడం కోసం జనం ఎగబడ్డారు. అందినకాడికి దొరకబట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. ఒక్కసారిగా సుమారు 2 వేల వరకు నాటుకోళ్లు ఊళ్లో ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు విస్తుపోయారు. ఒక్కసారిగా కోళ్లను చూసిన గ్రామస్తుల ఆనందానికి హద్దులు లేవు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పాకడంతో గ్రామస్తులంతా ఊరి చివరకు చేరి కోళ్లను పట్టుకున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు కోళ్లను పట్టుకొని ఇంటికి తీసుకువెళ్లగా.. కొందరు పదుల సంఖ్యలో పట్టుకెళ్లారు. దొరికినన్ని కోళ్లను పట్టుకొని.. నాటు కోడికూర వండుకొని పండుగ చేసుకున్నారు. ఊరంతా కోళ్లను వండుకుని తినడంతో పండుగ వాతావరణం తలపించింది. ఈ విషయం జిల్లా మొత్తం తెలియడంతో గ్రామస్తులు లక్కీ ఛాన్స్ కొట్టేశారు అని అందరూ అంటున్నారు. అయితే.. ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Maoist Partys Ceasefire: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
Follow Us