/rtv/media/media_files/2025/09/26/komatireddy-1-2025-09-26-13-36-29.jpg)
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులు రాజగోపాల్ రెడ్డిని కలిసారట. అయితే మద్యం వ్యాపారులకు ఆయన మూడు కండిషన్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వైన్ షాపులు నిర్వహించాలనుకునే వారికి ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి భిన్నంగా సొంత నిబంధనలను విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రాజన్న రూల్స్ ఇవే
వైన్ షాపు వేళల్లో మార్పు: వైన్ షాపు వేళల్లో మార్పు: వైన్ షాపులు ఉదయం 10 గంటలకు తెరవడానికి వీల్లేదు. మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే షాపులు తెరవాలి. రాత్రి 10 గంటలకు దుకాణాలు మూసివేయాలి.
పర్మిట్ రూమ్‌ల మూసివేత: పర్మిట్ రూమ్‌లు పగటిపూట పూర్తిగా మూసివేయాలి. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేసి, వైన్ షాపుతో పాటే రాత్రి 10 గంటలకు క్లోజ్ చేయాలి.
బెల్టు షాపులకు మద్యం అమ్మకాలు నిషేధం: మద్యం దుకాణాల యజమానులు బెల్టు షాపులకు లిక్కర్ అమ్మేందుకు వీల్లేదు. ఈ ఆదేశాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
తన ఆదేశాల మేరకే మునుగోడులో లిక్కర్ షాపులు నడవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని మొత్తం 159 గ్రామాల్లో ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేస్తానని, ఈ టీమ్స్ బెల్టు షాపులపై, అలాగే నిబంధనలు పాటించని వైన్ షాపులపై నిఘా పెడతాయని ఆయన మద్యం వ్యాపారులకు తెలియజేశారు. తాను గీసిన లైన్ దాటితే, నేను పెట్టిన షరతులను దాటితే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
Follow Us