/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
murder
TG Crime : మనుషుల్లో రాక్షస పవృత్తి విపరీతంగా పెరుగుతోంది. తల్లి,తండ్రి, భార్య, భర్త, కొడుకు అనే వావివరుసలు లేకుండా ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. గడచిన కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు కొకొల్లలుగా జరుగుతున్నాయి. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కన్న కొడుకు దారుణంగా కొట్టి చంపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తుజగూడ గ్రామానికి చెందిన అజ్జుఖాన్ (50) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ నెల 6న మద్యం సేవించిన అజ్జుఖాన్ పనికి పోకుండా గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద కూర్చున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద పనికి వస్తానని డబ్బులు తీసుకుని పనికి రాకపోవడంతో.. ఆ వ్యక్తి అజ్జుఖాన్ వద్దకు వచ్చి పైసలు తీసుకుని పనికి ఎందుకురావడం లేదని అజ్జుఖాన్‌తో పాటు ఆయన భార్యను నిలదీశాడు.
ఇది కూడా చదవండి:అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్
అయితే ఆ సమయంలో అక్కడికి దగ్గరలోనే ఉండి గమనిస్తున్న ఆయన కొడుకు అజీమ్‌ఖాన్‌కు ఇదంత అవమానంగా అనిపించింది. తన తండ్రి రోజు మద్యం సేవించి పనికి వెళ్లక పోవడం వల్ల అందరూ ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, అందరితో గొడవ పడుతూ తమ కుటుంబ పరువు తీస్తున్నాడని ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన తండ్రిని చంపితే సమస్య పరిష్కారం అవుతుందని కోపంతో ఊగిపోయాడు. ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తి వాకింగ్ స్టిక్ తీసుకొని తండ్రి తలపై, శరీర భాగాలపై విచక్షణరహితంగా కొట్టాడు. దీంతో అజ్జుఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అజ్జుఖాన్‌ను ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు కలిసి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కాగా అజ్జుఖాన్ చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతి చెందాడు. కాగా తండ్రిని విపరీతంగా కొట్టి గాయపరిచిన కొడుకు అజీమ్‌ఖాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.
ఇది కూడా చదవండి:లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!