/rtv/media/media_files/2025/03/15/felnA8wOEEu6YG7VANgt.jpg)
dehradun lady si accused constable of rape
కామాంధుల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నమ్మిన వారినే కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి వారిపైనే అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో చోటుచేసుకుంది. మహిళా ఎస్సైపై ఒక కానిస్టేబుల్ అత్యాచారినికి పాల్పడ్డాడు. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది. కొద్ది రోజులు ఓపిక పట్టిన బాధితురాలు మహిళా ఎస్సై తాజాగా పటేల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ అస్లాంపై పలు తీవ్రమైన అభియోగల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
హోటల్‌లో అత్యాచారం
ఫిర్యాదు ప్రకారం.. మహిళా ఎస్సై ఇటీవల ఒక కొండ ప్రాంతం నుంచి డెహ్రాడూన్‌కి ట్రాన్సఫర్ అయింది. అయితే డ్యూటీ లొకేషన్ దూరంగా ఉండటంతో.. డెహ్రాడూన్‌లోని ఓ హోటల్‌లో బస చేయాలని అనుకున్నానని.. ఇందులో భాగంగానే కానిస్టేబుల్‌కు హోటల్‌లో రూమ్ బుక్ చేయమని అడిగినట్లు తెలిపింది. తాను హోటల్‌కి వెళ్లిన తర్వాత.. కానిస్టేబుల్ తన రూమ్ తనిఖీ చేసే ఉద్దేశంతో లోపలికి వచ్చాడని.. అప్పుడే తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
అతడు తనపై అత్యాచారం చేయడంతోపాటు వీడియో రికార్డు కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే.. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని అతడు బ్లాక్ మెయిల్ చేసినట్లు వెల్లడించింది. ఇక ఆ సంఘటన జరిగిన తర్వాత తాను తీవ్ర మనస్తాపానికి గురై కొద్ది రోజులు సెలవుపై ఇంటికి వెళ్లానని తెలిపింది.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
అనంతరం ఇంటి నుంచి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాక కూడా అతడు బ్లాక్ మెయిల్ చేసి పలు మార్లు అత్యాచారం చేసినట్లు ఆమె పేర్కొంది. చివరకు ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపించారు. బాధితురాలి ఆరోపణలు నిజమైతే.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...