/rtv/media/media_files/2025/02/27/hZ07vqHKRIR8ksxCfDx5.jpg)
తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు (MLC Elections) ప్రశాంతంగా ముగిశాయి. ఏపీలో మూడు, తెలంగాణ మూడు స్థానాలకు గానూ గురువారం పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగగా.. క్యూలైన్లో నిలుచుకున్నవారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు. పోలింగ్ వద్ద ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Also read : వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన
ఏపీలో వైసీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ ప్రధానంగా పోటీలో నిలిచింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగగా.. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో మధ్యాహ్న 2 గంటల వరకు 45.29 శాతం పోలింగ్. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 49.06 శాతం పోలింగ్. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 79.54 శాతం పోలింగ్ నమోదు అయింది.
Also read : కోమాలో భారతీయ విద్యార్థిని.. తండ్రి అత్యవసర ప్రయాణం కోసం కేంద్రం సాయం!
మూడు స్థానాల్లో బీజేపీ పోటీ
ఇక తెలంగాణలో బీజేపీ (BJP) మూడు స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ (Congress) ఒక్క స్థానంలో బరిలో నిలిచింది. బీఆర్ఎస్ (BRS) బరిలో లేదు. పెద్దపల్లిలో అత్యధికంగా 77.95 శాతం పోలింగ్ నమోదైంది. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. మార్చి 03వ తేదీ సోమవారం రోజున ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు వెల్లడించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లను తరలించి… గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
Also read : Sikandar Teaser: యాక్షన్ తో దుమ్ములేపిన సల్లు భాయ్.. సికిందర్ టీజర్ చూశారా?
Also read : Nabha Natesh: చీరలో అదిరిపోయిన ఇస్మార్ట్ బ్యూటీ.. ఎంత ముద్దుగా ఉందో! మీరే చూడండి