ECI: లోక్సభ ఎన్నికలు.. నిత్యం పట్టుబడుతున్న రూ.100 కోట్లు
లోక్సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర తాయిలాలను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.