/rtv/media/media_files/2026/01/06/fotojet-88-2026-01-06-18-02-26.jpg)
China Manza has become a death trap
Chaina Manza : సంకాంత్రి పండుగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ముత్యాల ముగ్గులు,హరిదాసులు, చకినాలు. వీటికి తోడు అతి ముఖ్యంగా చెప్పుకోదగింది పతంగులు. పండుగ వచ్చిందంటే ఇంటిపైకి ఎక్కి పతంగులు ఎగరవేయడం చేస్తుంటారు. మన గాలిపటంతో ఇతరులు ఎగురవేసే గాలిపటాన్ని తెగ్గోస్తే అదో సరదా. అయితే ఆ సరదా తీరాలంటే దానికి మాంజా కావాలి. సాధారణంగా మాంజా తయారీలో సీసం పౌడర్‌ను వినియోగిస్తుంటారు. దీనివల్ల మనుషులకే కాక పశుపక్ష్యాదులకు కూడా ఎంతో ప్రమాదం. మాంజా ప్రమాదమని తెలిసినా చాలామంది మాంజా వాడుతుంటారు. సాధారణ మాంజాతో పాటు ప్రమాదకరమైన చైనా మాంజాను కూడా వాడుతుంటారు. ఈ మాంజా మూలంగా పావురాలు వంటి పక్షులు మృత్యవాత పడటంతో పాటు రోడ్డుపై వెళ్లే వారికి కూడా ప్రమాదం పొంచి ఉంది. దీంతో చైనా మాంజాను నిషేదించారు. కానీ చాలామంది అవన్ని ఏం పట్టించుకోకుండా మాంజాను వినియోగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు
చైనా మాంజాలపై నిషేధం ఉన్నప్పటికీ పలువురు గుట్టు చప్పుడు కాకుండా వీటిని అమ్ముతున్నారు. పతంగులు అమ్మె వర్తుకులతో పాటు పలువురు చైనా నుంచి ఈ మాంజాను దిగుమతి చేసుకుని దొగతనంగా అమ్ముతున్నారు. అయితే ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే కొద్ది రోజులు హల్‌చల్ చేసే అధికారులు అది కాస్తా సద్దుమణగగానే ఆ విషయాన్ని గాలికి వదిలేస్తున్నారు. దీనితో యధేచ్ఛగా చైనా మాంజాల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మాంజాలతో ఒకరి సరదా మరొకరి ప్రాణాల మీదకు వస్తుంది. ఈమధ్య కీసరలో మాంజా వల్ల ఓ యువకుడి గొంతు తెగిన ఘటన మరువక ముందే డిసెంబరు 29న నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన జమీల్ బైక్‌పై వెళుతుండగా శంషీర్‌గంజ్ వద్ద చైనా మాంజా అడ్డుపడటంతో అతడి గొంతును కోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వాహనదారులు తస్మాత్ జాగ్రత్త
చైనా మాంజాల వల్ల అనేకమంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పతంగులు తెగిపోవడంతో సంబంధిత మాంజా రోడ్లపై వేలాడుతుంటుంది. దీన్ని గమనించకండా వాహనదారులు వెళ్లి నపుడు అ మాంజా నేరుగా వాహనదారుడి మెడకు చుట్టుకుని ప్రమాదాలకు కారణమవుతుంది. ద్విచక్ర వాహనాల ముందు చిన్నారులను కూర్చోబెడుతుంటారు. ఇది మారీ ప్రమాదం. సంక్రాంతి సమీపిస్తుండడంతో పిల్లలు, పెద్దలు పోటాపోటీగా గాలిపటాలను ఎగురవేస్తుంటారు. దీనితో తెగిపోయిన మాంజా భవనాల మధ్య వేలాడుతుంటుంది. దీనిని గమనించకుండా వాహనదారులు వెళుతుండటంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అందువల్ల ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు మెడకు ఖర్చీఫ్ కట్టుకుని, తలపై హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు.
పతంగులు ఎగురవేసేందుకు సీసం పౌడర్ తో తయారు చేసిన మాంజాను వాడుతుంటారు. దీనివల్ల గతంలో అనేక ప్రమాదాలు సంభవించాయి. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) దేశవ్యాప్తంగా మాంజాలపై నిషేధాన్ని విధించింది. మాంజాల వల్ల పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతుండడంతో గాజుసీసం పౌడర్‌తో తయారు చేసే చైనా మాంజా, కాటన్ మాంజా, నైలన్ మాంజాలను ఎన్‌జీటీ నిషేధించింది. చైనా మాంజాలపై నిషేధం ఉన్నప్పటికీ పలువురు దాన్ని వాడుతున్నారు. ఈ మాంజా చాలా పదునుగా ఉండడం వల్ల మెడలకు, ముఖాలకు తగిలితే తీవ్ర గాయాలు చేసి ప్రాణాలు తీస్తుంది. వీటి వల్ల పక్షులు వీటికి చిక్కుకుని తీవ్రంగా గాయపడి చనిపోతాయి. చైనీస్ మాంజా అంటే నైలాన్, సింథటిక్, గాజు పూత పూసిన దారం. వీటిపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. దీనిని ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కనుక పతంగులను కాటన్ దారలతోనే ఎగురవేయాలి. అలాగే అధికారులు మాంజా తయారీ కేంద్రాలు, ప్రదేశాలను తనిఖీ చేసి మాంజాను తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మాం జాలు అమ్మే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాంజాను ఉపయోగించడం వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Follow Us