iPhone : ఆపిల్ ఐఫోన్, ఐపాడ్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

యాపిల్, ఐఫోన్ లాంటివి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనడం అంటే కష్టమే.  చాలామందికి రోజువారి సంపాదనే సరిపోదు. అలాంటిది లక్షలు పోసి మరి ఇలాంటి ఖరీదైన ఫోన్లు కొనాలంటే చాలా కష్టతరమనే చెప్పాలి.

New Update
iphone

యాపిల్, ఐఫోన్ లాంటివి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనడం అంటే కష్టమే.  చాలామందికి రోజువారి సంపాదనే సరిపోదు. అలాంటిది లక్షలు పోసి మరి ఇలాంటి ఖరీదైన ఫోన్లు కొనాలంటే చాలా కష్టతరమనే చెప్పాలి. అయితే చైనాకు చెందిన ఓ 17 ఏళ్ల కుర్రవాడు మాత్రం..  ఐఫోన్ ఐప్యాడ్ కొనటానికి  తన కిడ్నీ అమ్మేశాడు. ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. చైనాకు చెందిన వాంగ్ షాంగ్‌కున్ అనే వ్యక్తి ఐఫోన్,  ఐప్యాడ్ కొనుక్కోవాలనే కోరికతో 2011లో బ్లాక్ మార్కెట్‌లో అక్రమంగా తన కిడ్నీని అమ్మాడు. ఆ కిడ్నీ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో, అతడు ఐఫోన్ 4,  ఐప్యాడ్ 2  కొనుక్కున్నాడు. ఒక కిడ్నీ ఉంటే సరిపోతుంది, రెండు ఎందుకని భావించాడు. 

షాంగ్‌కున్‌కు తీవ్ర ఆరోగ్య సమస్యలు

అయితే, ఈ అక్రమ శస్త్రచికిత్స తర్వాత, షాంగ్‌కున్‌కు తీవ్ర ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో పరిశుభ్రత లేకపోవడం, సరైన వైద్య సంరక్షణ  లేకపోవడం వల్ల, అతని మిగిలిన కిడ్నీ కూడా దెబ్బతిని మూత్రపిండ వైఫల్యానికి గురైంది. దీంతో, అతను అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. ప్రస్తుతం అతడు డైలీ డయాలసిస్ చేయించుకుంటూ జీవిస్తున్నాడు. ఈ అక్రమ అవయవ మార్పిడి కేసులో, 2012లో తొమ్మిది మందిని అరెస్టు చేయగా, ఐదుగురికి జైలు శిక్ష పడింది. షాంగ్‌కున్ కుటుంబానికి అతని వైద్య ఖర్చుల కోసం పరిహారం కూడా లభించింది.

ఐఫోన్ల మోజులో యువత చేస్తున్న కొన్ని ప్రమాదకర తప్పులను ఈ ఘటన ఎత్తి చూపుతోంది. ఇప్పటికీ చాలా మంది  ప్రమాదకరమైన షార్ట్‌కట్‌లను తీసుకోవడానికి ప్రలోభపడుతున్నారు. అయితే అక్రమ అవయవాల అమ్మకాల ప్రమాదాల గురించి ఇతరులకు అవగాహన కల్పించాలనే ఆశతో వాంగ్ తన జీవిత అనుభవాన్ని పంచుకున్నాడు. క్షణిక కోరికతలో చేసే తప్పులకు లైఫ్ లాంగ్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వాంగ్ యువతను హెచ్చరిస్తున్నాడు. 

Advertisment
తాజా కథనాలు