Sexual Harassment : వీడసలు మనిషేనా?.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు

ఓ విద్యార్థిని అనారోగ్యంతో చందానగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. అయితే ఆ విద్యార్థినిపై అదే ఆస్పత్రిలోని వార్డ్ బాయ్ ప్రైవేట్ పార్ట్‌లను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. చందానగర్ లోని పీఆర్కే హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

New Update
Ward Boy Sexual harassment

 Ward Boy Sexual harassment

కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది ఆడవారిపట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వారసలు మనుషులేనా? అనే సందేహం కలగకమారదు. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సైతం వదలడం లేదు కొంతమంది కామంధులు. తమ కామవాంఛ తీర్చుకోవడానికి వారిపైనా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద చందానగర్‌లో జరిగిన ఈ సంఘటనే దీనికి నిదర్శనం.

ఓ విద్యార్థిని అనారోగ్యంతో చందానగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. అయితే ఆ విద్యార్థినిపై అదే ఆస్పత్రిలోని వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు(Ward Boy Sexual Harassment) ఆరోపణలు వస్తున్నాయి. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఆర్కే హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఒడిస్సాకు చెందిన ఆ విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు తెలిసింది. 

Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ

Ward Boy Sexual Harassment

హెచ్‌సీయూ(HCU) లో విద్యాభ్యాసం చేస్తున్న ఒక విద్యార్థిని అనారోగ్య సమస్యలతో చందానగర్‌లోని పీఆర్కే ఆస్పత్రిలో చేరింది. అయితే ఆ విద్యార్థిని చికిత్స పొందతున్న సమయంలో ఆస్పత్రిలోని వార్డ్ బాయ్  బాధిత విద్యార్థిని ప్రైవేట్ పార్ట్‌లను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. కాగా చికిత్స అనంతరం చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న హెచ్‌సీయూ విద్యార్థిని  పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయాన్ని హాస్పిటల్ నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిసింది.  అయితే అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్‌ని కఠినంగా శిక్షించాలని హెచ్‌సీయూ విద్యార్థిని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాధితురాలికి అండగా ఉండాల్సిన పోలీసులు వార్డు భాయ్‌ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చూడండి:Rahul Sipligunj Engagement: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. వైరలవుతున్న ఫొటోలు!

Advertisment
తాజా కథనాలు