Khajana Jewelry: ఖజానా జ్యువెలరీలో చోరీ చేసింది వీరే.. కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి నాటు తుపాకులు, బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.