Vizag AAA Cinemas: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

అల్లు అర్జున్ వైజాగ్ లో AAA థియేటర్స్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ థియేటర్ మేలో ప్రారంభం కానుంది. అత్యాధునిక సదుపాయాలతో, సినీ ప్రేక్షకులకు ప్రీమియం అనుభవం అందించడమే లక్ష్యంగా రూపొందుతుంది.

New Update
Vizag AAA Cinemas

Vizag AAA Cinemas

Vizag AAA Cinemas:

విశాఖపట్నం సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన థియేటర్ల బిజినెస్ ను విస్తరిస్తున్నారు, విశాఖపట్నంలో అత్యాధునిక "AAA థియేటర్స్" ను ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్టును సునీల్ నారంగ్ భాగస్వామిగా ముందుండి నడిపిస్తున్నారు. "ఈ థియేటర్ మేలో ఓపెన్ కానుంది. విశాఖపట్నం ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో ఈ థియేటర్‌ను ఇనార్బిట్ మాల్‌లో నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు.

తెలుగు సినీ స్టార్స్‌తో కలిసి ప్రీమియం థియేటర్ల నిర్మాణం చాలా గొప్ప అనుభవం ఇచ్చిందని సునీల్ నారంగ్ తెలిపారు. "మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్ లాంటి స్టార్‌లతో బిజినెస్ చేయడం పరస్పర లాభదాయకం. వారు తమ విలువైన సూచనలు ఇస్తారు. ఆ సూచనలతో థియేటర్‌లలో మంచి అంబియన్స్, సౌండ్ ఎఫెక్ట్స్ వంటివి హై క్వాలిటీ అందించడానికి ఉపయోగపడతాయి" అన్నారు.

అలాగే వెంకటేష్ గారితో కలసి హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్‌లో ఉన్న ప్రఖ్యాత సుదర్శన్ 70MM థియేటర్‌ను మళ్లీ కొత్తగా తీర్చిదిద్దుతున్నాం" అని కూడా ఆయన వెల్లడించారు. ఈ థియేటర్ల లక్ష్యం ప్రేక్షకులకు కేవలం సినిమా చూపించడమే కాదు, ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడం. సౌండ్, విజువల్స్, సీటింగ్, మొత్తం ఇంటీరియర్ డిజైన్‌ వరకు ప్రతీ అంశం పై పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు