Skin Health: అరేబియన్ భామల అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా?

అరేబియన్ భామలు ఎంతో అందంగా ఉంటారు. నల్లగా నిగనిగలాడే కురులు, మృదువైన చర్మంతో అరేబియన్ భామలు మెరుస్తుంటారు. వీరు ఎక్కువగా అవకాడో ఫేస్ ప్యాక్, తేనె, ఆర్గర్ నూనెతో కలిపిన ప్యాక్‌లను ముఖానికి అప్లై చేస్తారు. వీటివల్ల వీరు ఎంతో అందంగా ఉంటారు.

New Update
arabian girl

arabian girl

అరేబియన్ భామలు ఎంతో అందంగా ఉంటారు. నల్లగా నిగనిగలాడే కురులు, మృదువైన చర్మంతో అరేబియన్ భామలు మెరుస్తుంటారు. వంద మందిలో కూడా అదిరిపోయే లుక్‌లో వీరు కనిపిస్తారు. మరి ఈ భామల అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? చర్మ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అనే విషయాలు మీకు తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. 

ఇది కూడా చూడండి: Financial Issues: ఆర్థిక సమస్యల వేధింపులు భరించలేకపోతున్నారా.. ఇలా చేస్తే చాలు.. మీ ఇంటి నిండా డబ్బే డబ్బు

అవకాడో ఫేస్ ప్యాక్

అరేబియన్ భామలు ఎక్కువగా అవకాడో తీసుకుంటారు. అవకాడోను సలాడ్, సాస్‌ల్లో తినడంతో పాటు వాటి గుజ్జును చర్మానికి కూడా అప్లై చేస్తారు. అవకాడో గుజ్జులో తేనె, నిమ్మరసం, కొబ్బరినూనె కలిపి ప్యాక్‌లా వేసుకుంటారు. వారానికొకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం మృదువుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

ఆర్గన్ నూనె

అరేబియన్ల సౌందర్య పోషణలో ఆర్గన్ ఆయిల్‌ది చాలా ముఖ్యమైనది. దీన్ని అరేబియన్లు ఎక్కువగా వాడతారు. వీటివల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు.

తేనె

చర్మాన్ని మెరిపించడంలో తేనె బాగా ఉపయోగపడుతుంది. తేనె చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు తెల్లగా మారేలా చేస్తుందని నిపుణులు  చెబుతున్నారు. అయితే అరేబియన్లు కీరదోస రసంలో తేనె కలిపి ముఖ్యానికి ప్యాక్ వేసుకుంటారట. 

గుడ్డు

గుడ్డులో ఉన్న తెల్ల సొనతో చర్మానికి, జుట్టుకి ప్యాక్ వేసుకుంటారు. గుడ్డులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. గుడ్డు తెల్ల సొనలో కొబ్బరి నూనె వేసి జుట్టుకు అప్లై చేస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుందట. 

కెఫిర్

అరేబియన్లు సౌందర్యం కోసం కెఫిర్ అనే బ్యాక్టీరియాతో తయారు చేసిన పెరుగు తీసుకుంటారు. ఈ బ్యాక్టీరియా అరేబియన్ అమ్మాయిల సౌందర్యాన్ని పెంచుతుందట. ఈ పెరుగును తినడంతో పాటు చర్మానికి, జుట్టుకు కూడా అప్లై చేస్తారు. అందుకే వీరు ఎంతో అందంగా కనిపిస్తారు. 

కలబంద

కలబందను కూడా అరేబియన్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఆర్గన్ ఆయిల్ కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటారు. దీంతో ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. దీంతో వారు ఎక్కువ ఏళ్లు యవ్వనంగా కనిపిస్తారు. ఈ చిట్కాలు అన్ని అరేబియన్లు పాటించడం వల్ల అందంగా కనిపిస్తుంటారు.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Japanese Health Secret: జపాన్‌లో లక్ష మందికి 100 ఏళ్లకు పైగా ఆయుష్షు.. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు