Telangana: రెండో విడత కౌంటింగ్‌లో దూసుకుపోతున్న కాంగ్రెస్

తెలంగాణలో రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే మొదటి విడతలో అత్యధికంగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండో విడుతలో కూడా జోష్‌ చూపిస్తోంది.

New Update
Congress

Congress

తెలంగాణలో రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే మొదటి విడతలో అత్యధికంగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండో విడుతలో కూడా జోష్‌ చూపిస్తోంది. ఈరోజు 193 మండలాల్లో 3,911 గ్రామ పంచాయతీలకు, 29,917 వార్డు సభ్యులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు పలు గ్రామాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. - local-body-elections

Also Read:  ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో సర్పంచి పదవి

Congress Leading Position Of Panchayat Elections

ఇందులో 600కు పైగా గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 200కు పైగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, 70 మంది బీజేపీ అభ్యర్థులు, ఇతరులు 200కు పైగా స్థానాల్లో గెలుపొందారు. మిగతా గ్రామ పంచాయతీల్లో ఇంకా కౌంటింగ్‌ కొనసాగుతోంది. అయితే రెండో విడుతలో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని పార్టీ సభ్యులు భావిస్తున్నారు. 

Also Read :  మొదలైన ఎన్నికల కౌంటింగ్‌.. ఒకే ఓటు తేడాతో సర్పంచ్‌గా విజయం

Advertisment
తాజా కథనాలు