Telangana: మొదలైన ఎన్నికల కౌంటింగ్‌.. ఒకే ఓటు తేడాతో సర్పంచ్‌గా విజయం

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్‌లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్‌ సర్పంచ్‌గా చంద్రశేఖర్ అనే అభ్యర్థి రెండు ఓట్ల తేడాతోనే విజయం సాధించారు.

New Update
Telangana local body election Counting updates

Telangana local body election Counting updates

TG Local Body Election Counting Updates

తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల(local-body-elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అయితే వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్‌లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి గొల్ల రమాదేవి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్‌ సర్పంచ్‌గా చంద్రశేఖర్ అనే అభ్యర్థి రెండు ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి తండాలో కాంగ్రెస్ మద్దతుదారు హజీనాయక్‌ అయిదు ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం, కులస్పూర్‌ తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లలితా భాయి కేవలం 5 ఓట్ల తేడాతోనే సర్పంచ్‌గా గెలుపొందారు. 

Also Read :  కేసీఆర్ సంచలన ప్రకటన.. ఇక ఉద్యమమే.. 19న కీలక మీటింగ్!

Also Read :  ఓటేయడానికి వెళ్తూ..తిరిగిరాని లోకాలకు..

Advertisment
తాజా కథనాలు