Schools Re open : తెలంగాణ, ఏపీలో తెరుచుకోనున్న స్కూల్స్.. కొత్త రూల్స్‌ ఇవే...

ఎండకాలం సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూల్స్‌ తిరిగి తెరుచుకోనున్నాయి. సెలవుల్లో హాయిగా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్లే సమయం ఆసన్నమైంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ రేపటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

New Update
Schools Re open

Schools Re open

Schools Re open : ఎండకాలం సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూల్స్‌ తిరిగి తెరుచుకోనున్నాయి. సెలవుల్లో హాయిగా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పిల్లలు, తల్లిదండ్రులు ఈ విద్యా సంవత్సరానికి  సంబంధించిన స్టేషనరీ, బ్యాగులు, టిఫిన్‌ బాక్స్‌లు కొనుగోలు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు కూడా విద్యార్థులను ఆకర్శించడానికి సిద్ధమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Mangli: మంగ్లీ బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్‌.. ఎవర్నీ వదలమని హెచ్చరించిన పోలీసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు 2025--26 విద్యా సంవత్సరానికి  సంబంధించి ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో, విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఈ క్యాలెండర్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి  తెరచుకోనున్నాయి. 2025---26 విద్యా సంవత్సరానికి గాను 230 పనిదినాలను ఖరారు చేశారు. ఈ క్యాలెండర్‌లో బోధన సమయాలతో పాటు, సెలవులు, పరీక్షల తేదీలు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలను స్పష్టంగా పొందుపరిచారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా ఈ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి:మునగ నీటితో అద్భుత లాభాలు.. డయాబెటిక్ రోగులకు బెస్ట్‌ కషాయం..!!


 తాజాగా విడుదలైన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ప్రాథమిక పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తాయి. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగనున్నాయి.  కాగా తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నట్లు పాఠశాలల యజమాన్యాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇక తెలంగాణ ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నారు. కాగా తొలి ఏడాది 210 స్కూల్స్‌లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుంచి పాఠశాలల్లో ప్రతి రోజు 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలని విద్యాశాఖ సూచించింది. ఇది విద్యార్థులలో మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందించడానికి సహాయపడుతుంది.  

ఏపీలోనూ గురువారం నుంచి స్కూల్స్‌ ప్రారంభం కానున్నాయి.  కాగా ఈసారి స్కూల్ ఫస్ట్ డే  స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థి మిత్ర కిట్‌ పేరుతో తొలిరోజే వారికి అందజేయనుంది. ఈ కిట్‌లో  రెండు జతల స్కూల్ యూనిఫాంలు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులు, నోట్‌బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, ఇంగ్లీష్ డిక్షనరీ ఇవన్నీ ఉంటాయి. మరోవైపు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికీ రూ.15 వేలు అందించడానికి సిద్ధపడింది. 

ఇది కూడా చదవండి: Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. అసలేం జరిగిందంటే..!

Advertisment
తాజా కథనాలు