సిగ్గు.. సిగ్గు.. తెలుగు అకాడమి పుస్తకాలపై నిరుద్యోగులు ఫైర్!
తెలుగు అకాడమి పుస్తకాలపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో 'సిగ్గు, సిగ్గు.. వాటిని ఎవరు కొనొద్దు. చదవొద్దు. టీజీపీఎస్సీ మోసం' అంటూ పోస్టర్లు అంటించారు.