Mangli: మంగ్లీ బర్త్‌ డే పార్టీ వివాదం.. ఎవర్నీ వదలమని హెచ్చరించిన పోలీసులు

ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుక వివాదంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎంత ప్రముఖులైనా సరే నిబంధనలను పాఠించకపోతే.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

New Update
Drugs in singer mangli Party, telangana police strong warning post in x

Drugs in singer mangli Party, telangana police strong warning post in x

ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకలో విదేశీ మద్యం పట్టుబడటం కలకలం రేపింది. దీంతో మంగ్లీతో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎంత ప్రముఖులైనా సరే డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మంగళవారం రాత్రి రిసార్ట్‌పై చేవెళ్ల పోలీసుల సోదాలు చేసిన ఫోటోలు షేర్‌ చేసింది. 

Also Read: భార్య వివాహేతర సంబంధం.. ఆత్మహత్య చేసుకున్న భర్త

ఇక వివరాల్లోకి వెళ్తే.. జూన్ 10న సింగర్ మంగ్లీ తన బర్త్‌డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని ఓ రిసార్టులో స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు దాదాపు 50 మంది మంగ్లీ కుటుంబీకులు, స్నేహితులు హాజరయ్యారు. వీళ్లలో
 నటి దివి, రచయిత కాసర్ల శ్యామ్, మాజీ యాంకర్ దామోదర్ రెడ్డి సహా పలువురు సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. వీరికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్ వచ్చింది. అలాగే పర్మిషన్ లేకుండా పార్టీలో విదేశీ మద్యం కూడా వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగ్లీతో సహా ఈవెంట్‌ మేనేజర్, రిసార్ట్‌ మేనేజర్‌పై కేసులు నమోదయ్యాయి. 

Also Read: భార్య వివాహేతర సంబంధం.. ఆత్మహత్య చేసుకున్న భర్త

రాత్రి 2 గంటల సమయంలో ఎస్‌వోటీ పోలీసులు ఆ రిస్టార్టుపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. రూల్స్ పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. 

#telugu-news #drugs #telangana #rtv-news #mangli
Advertisment
Advertisment
తాజా కథనాలు