Saddula Bathukamma: బతుకమ్మ పండుగలో చివరి రోజు! అమ్మవారికి ఈ 5 నైవేద్యాలు పెట్టడం అస్సలు మర్చిపోవద్దు!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బతుకమ్మ. తొమ్మిరోజుల పాటు  రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈరోజు తొమ్మిదవ రోజు.. అంటే సద్దుల బతుకమ్మ.

New Update
Saddula Bathukamma

Saddula Bathukamma

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బతుకమ్మ. తొమ్మిరోజుల పాటు  రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈరోజు తొమ్మిదవ రోజు.. అంటే సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma 2025). మిగిలిన ఎనిమిది రోజులతో పోలిస్తే సద్దుల బతుకమ్మ చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ ఏడాది అష్టమి తిథి 28తో పాటు 29 రోజు కూడా కొంతసమయం ఉండడం వల్ల అష్టమి, నవమి ఒకే రోజు వచ్చాయి. దీంతో కొన్నిచోట్ల  29రోజే  సద్దుల బతుకమ్మ చేసుకుంటుండగా.. మరికొన్ని చోట్ల 30వ రోజున సద్దుల బతుకమ్మ.. ఆ మరుసటి రోజు తర్వాత దసరా జరుపుకుంటున్నారు. 

Also Read :  Dasara 2025: దసరా రోజు ఈ మొక్కని నాటితే.. మీ దరిద్రాలన్నీ పరార్.. తప్పక తెలుసుకోండి!

సద్దుల బతుకమ్మ విశిష్టత.. 

మిగిలిన రోజుల కంటే తొమ్మిదవ రోజు పేర్చే బతుకమ్మ(Bathukamma 2025) చాలా పెద్దదిగా తీరొక్క పువ్వులతో అలంకరించబడి ఉంటుంది. ఎన్ని రకాల పువ్వులు దొరికితే అన్ని రకాల పువ్వులతో ఎత్తైన బతుకమ్మను పేరుస్తారు. పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను కూడా తయారు చేస్తారు. ఆ తర్వాత పసుపుతో గౌరీ దేవి ప్రతిమను తయారు చేసి పూల మధ్యలో ఉంచి పూజిస్తారు. పూజ తర్వాత ఆ పసుపును మహిళలు ఒకరికొకరు రాసుకుంటారు. మహిళలు పసుపు, కుంకుమలతో  సౌభాగ్యంగా ఉండాలని ఇలా చేస్తారు. తాంబూలం పళ్ళెంలో అన్ని రంగుల పూలను వరుసలుగా వలయాకారంలో లేదా గోపురం/స్తూపం ఆకారంలో బతుకమ్మను పేరుస్తారు. ఒక్కొక్క వరుస పూలు పెట్టుకుంటూ మధ్యలో ఆకులు వేసి బతుకమ్మను ఎంతో ముద్దుగా అలంకరిస్తారు.  

ఇదే రోజున దుర్గాష్టమి పండగా కూడా జరుపుకుంటారు. దుర్గాష్టమి నాడు మహిషాసురు దహనం నిర్వహిస్తారు. పురాణాలలో దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి విజయాన్ని పొందుతుంది. ఆ విజయానికి చిహ్నంగా విజయదశమిని ( దసరా) జరుపుకుంటారు. 

Also Read: Navaratri 2025: అక్టోబర్ 1 లేదా 2.. నవరాత్రి ఉపవాసం ముగించడానికి సరైన రోజు ఏదో తెలుసా?

ఐదు రకాల నైవేద్యాలు.. 

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో రోజుక్క పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలా తొమ్మిదవ రోజు పెరుగన్నం, చింతపండు పులిహోర,  కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మలీద ముద్దలను కూడా నైవేద్యంగా పెడతారు. గోధుమ పిండి, బెల్లం/ చక్కర, సొంపుతో వీటిని తయారు చేస్తారు. ముందుగా గోధుమ పిండితో చపాతీలు చేసి వాటిని ముక్కలుముక్కలుగా కట్ చేసి.. వాటిలో బెల్లం, సోంపు వేసి బాహా కలిపి ముద్దలుగా కడతారు. దీనినే మలీద ముద్ద అంటారు.  

ఇక సాయంత్రం వేళా మహిళలంతా తాము తయారు చేసిన బతుకమ్మలను నైవేద్యాలను తీసుకొచ్చి ఒక చోట పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. సద్దుల బతుకమ్మ రోజున ఊరు వాడా అంతా ఒకేచోట చేరి సంబరాలు చేసుకుంటారు. ఆ తర్వాత బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసి.. వారు చేసుకొచ్చిన నైవేద్యాలను ఒకరొకొకరు తినిపించుకుంటారు. 

Advertisment
తాజా కథనాలు