/rtv/media/media_files/2025/04/21/ZJwIaSmdMz7PZFC2Iq7r.jpg)
Robbery of gold jewelry
TG Crime : అమాయకులను దోచుకునేందుకు దోపిడీ ముఠాలు కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల పేరు చెప్పి భార్యాభర్తలను దోపిడీ చేసిన ఘటన వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం రేపింది. కొందరు దుండగులు పోలీసుల పేరుతో రోడ్డుపై ఇద్దరు దంపతుల బైక్ ఆపి..బంగారు ఆభరణాలను అపహరించారు. మోసపోయామని తెలుసుకున్న ఆ దంపతులు బేల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
కౌట గ్రామానికి చెందిన సంతోష్, వందనలు తమ ద్విచక్ర వాహనంపై మాంగ్రూడ్ గ్రామం వెళ్లి తిరుగు పయనం అయ్యారు. పాఠన్ సమీపంలో రహదారిపై ఇద్దరు వ్యక్తులు వీరిని ఆపారు. తాము పోలీసులమని, ఎక్కడికి వెళ్లి వస్తున్నారని ప్రశ్నించారు. తాము ఒక హత్య కేసులో నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో దారి దోపీడీ దొంగలు ఎక్కువ ఉన్నారని మెడలో బంగారాన్ని తీసి కవర్లో పెట్టుకొని వెళ్లమని సలహా ఇచ్చారు. దుండగులు చెప్పిన మాట విన్న వందన.. తన మెడలో బంగారాన్ని తీసింది. బంగారాన్ని తాము కవర్లో పెట్టి ఇస్తామని దుండగులు చెప్పగా.. వారి చేతికి ఇచ్చింది. వారు చేతికి కవర్ ఇవ్వగానే ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి చూసేసరికి కవర్ లో గులక రాళ్లు దర్శనమిచ్చాయి. రాళ్ల కవర్‌ను వందనకు ఇచ్చి.. బంగారు ఆభరణాలతో దొంగలు పరార్ అయ్యారు.
Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
ఇది గమనించిన సంతోష్, వందన దంపతులు తాము మోసపోయామని గ్రహించారు. లబోదిబో అంటూ బేల పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తారు. రెండు బైక్‌లపై నలుగురు మాటు వేసి.. పోలీసుల పేరుతో మోసం చేశారని బాధితురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..