/rtv/media/media_files/2025/04/20/ztbuMUGltuuscwoXUq9P.jpg)
Men Protest For Male Commission At Jantar Mantar In Delhi
ఒకప్పుడు కొందరు భర్తలు మాత్రమే భార్యలను హింసించేవాళ్లు. భర్తల చేతిలో వాళ్లు చిత్ర హింసలు అనుభవించేవాళ్లు. ఇందుకోసమే మహిళలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు వచ్చాయి. అలాగే మహిళా కమిషన్ కూడా ఏర్పడింది. ప్రస్తుత రోజుల్లో కేవలం భార్యలు మాత్రమే కాదు.. కొందరు భర్తలు కూడా వారి భార్యల చేతిలో నరకం అనుభవిస్తున్నారు. భార్యల చేతిలో హింస, వేధింపులకు గురవుతున్న భర్తలు కూడా చాలామందే ఉన్నారు.
Also Read: కుల భేదాలకు స్వస్థి పలుకుదాం.. హిందువులకు మోహన్ భగవత్ సూచనలు
ఈ క్రమంలోనే మహిళా కమిషన్ మాదిరిగానే.. పురుషుల కూడా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఢిల్లీలో నిరసనలు మొదలయ్యాయి. జంతర్ మంతర్‌లో శనివారం 'పురుష సత్యాగ్రహం' చేపట్టారు. సేవ్ ఇండియా ఫ్యామిలీ సంస్థ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పురుషులు, భర్తల హక్కుల కోసం పోరాడుతున్న 40 ఎన్జీవోల ప్రతినిధులు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు.
వీళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వందమంది ఉన్నారు. అంతేకాదు ఇటీవల భార్య చేతుల్లో హత్యకు గురైన, భార్య వేధింపులు తాళలేక సూసైడ్‌లు చేసుకున్న భర్తల కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నాలో పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చట్టాల్లో లింగ వివక్షను నిర్మూలించాలన్నారు. గృహ హింస, లైంగిక వేధింపుల కేసుల వల్ల చాలా మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Also Read: ఐపీఎల్ ఆయన వల్లే సాధ్యమయ్యింది.. లలిత్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
telugu-news | national-news