Accident: ORRపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

New Update
Accident

Accident

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. కారు వెనుక సీట్లో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని బీదర్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.   

Also Read: 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!

Road Accident On ORR

సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన వాళ్లను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మృతులు హైదరాబాద్‌ మేడిపల్లి, బోడుప్పల్‌కు చెందిన యశ్వంత్‌ (25), చార్లెస్ (25)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read :  నా తండ్రితో పడుకో.. లేదంటే! భార్య నగ్నవీడియోలు తీసి భర్త వేధింపులు!

ఇదిలాఉండగా మెదక్ జిల్లాలో ఆదివారం మరో విషాదం చోటుచేసుకుంది. చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో వరికోత యంత్రం ఢీకొని ఓ నాలుగేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇంటిముందు ఆడుకుంటుండగా ఆ బాలుడిని వడ్ల మిషన్ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  సమాచారం మేరకు పోలీసుల ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను వాళ్లు అదుపులోకి తీసుకున్నారు. చివరికి బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలుడి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

Also Read: ఇజ్రాయెల్‌కు బిగ్‌షాక్.. ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు మిస్సైల్ దాడి

Also Read: దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

rtv-news | accident | telangana | orr

Advertisment
తాజా కథనాలు