Azharuddin: రేవంత్‌ సంచలన నిర్ణయం..అజారుద్దీన్‌కు మంత్రి పదవి?

రేవంత్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంపిక చేసిన అమీర్‌ ఆలీఖాన్‌ను పక్కన పెట్టి మహమ్మద్‌ అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించింది. అజహర్ కు క్యాబినెట్‌ లో అవకాశం ఇవ్వడం కోసమే ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారని తెలుస్తోంది.

New Update
Ministerial post for Azharuddin?

Ministerial post for Azharuddin?

Azharuddin:

రేవంత్‌( Revanth Reddy ) ప్రభుత్వం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంపిక చేసిన కోదండరాం( Kodandaram ), అమీర్‌ఆలీఖాన్‌ ల ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు సమావేశమైన క్యాబినెట్‌( Telangana Cabinet ) మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంపిక చేసిన అమీర్‌ ఆలీఖాన్‌ను పక్కన పెట్టి మహమ్మద్‌ అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించింది.  అజహరుద్దీన్‌కు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ నిర్ణయం వెనుక అధిష్టానం బిగ్‌ స్కెచ్‌ ఉందని తేలింది. అదెంటంటే ప్రస్తుతం రేవంత్‌ క్యాబినెట్‌లో ఒక్కరు కూడా మైనారిటీ మంత్రి లేరు.

Also Read: చైనాలో అడుగుపెట్టిన మోదీ.. ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి !

నిజానికి గత ఎన్నికల్లో ఒక మైనారిటీ ఎమ్మెల్యే కూడా గెలవలేదు. మరోవైపు హైదరాబాద్‌ నుంచి ఒక కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా గెలవలేదు. దీంతో మంత్రివర్గంలో మైనారిటీలకు, హైదరాబాదీలకు చోటు దక్కలేదు. తాజాగా అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి అతనికి క్యాబినెట్‌ లో అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందట. దీంతో ఒకే కోటాలో హైదరాబాద్‌, మైనారిటీ కోటాను భర్తీ చేయవచ్చని పార్టీ నిర్ణయించింది. తాజాగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా  ప్రొఫెసర్‌ కోదండరాంతో పాటు అజారుద్దీన్‌ పేర్లకు క్యాబినెట్‌ శనివారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

హైదరాబాదీగా గానే కాకుండా మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ కూడా అయిన ముహమ్మద్ అజహరుద్దీన్‌.. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మురాదాబాద్ (ఉత్తరప్రదేశ్) లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో ఆయనకు టోంక్ (రాజస్థాన్) నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే అక్కడ ఆయన  ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణకు తిరిగొచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై కొంతకాలం పనిచేశారు. 2023లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read:పాఠశాల మరుగుదొడ్డిలో 9వ తరగతి విద్యార్థిని ప్రసవం..

అయితే ఇటీవల మాగంటి మరణం  తర్వాత జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ అజహరుద్దీన్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. మరోవైపు మైనారిటీ విభాగం ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం ఆయనకే సీటు ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టడం గమనార్హం. అయితే ఆయనకు మంత్రిపదవి హామీతోనే ఎమ్మెల్సీగా ఒప్పించినట్లు తెలుస్తోంది. కాగా మంత్రి వర్గంలో నాలుగు బెర్తులు ఖాళీగా ఉండగా ఇటీవల ఇద్దరికి అవకాశం కల్పించగా మరో ఇద్దరికీ అవకాశం ఉంది. తాజాగా అజహరుద్దీన్‌కు మైనారిటీ కోటాలో మంత్రిపదవి లభిస్తే..మరో స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారోనని చర్చ సాగుతోంది. కాగా, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్‌ నుంచి మైనార్టీ, కమ్మ, బీసీ సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. అయితే వారెవరినీ కాదని అధిష్టానం మరోక నేతకు అవకాశం ఇస్తుందనే ప్రచారం సాగుతోంది.  

Also Read:Maldives Vacation: మాల్దీవ్స్ లో చిల్ అవుతున్న స్టార్ హీరోయిన్ .. ఫొటోలు చూశారా!

#Azharuddin #Telangana cabinet caste balance #New Ministers in Telangana Cabinet #mohammad-azharuddin #cm-revanthreddy #kodandaram #Telangana Cabinet
Advertisment
తాజా కథనాలు